కవితను ఇరికించేసిన బుచ్చి, పిళ్ళై – అరెస్ట్ తప్పదా..?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ తాజాగా దాఖలు చేసిన మూడో చార్జీషీట్ సంచలనం రేపుతోంది. కవిత పాత్రపై పక్కా ఆధారాలను ఈడీ కోర్టుకు సమర్పించింది. గత చార్జీషీట్లతో పోలిస్తే ఈ చార్జీషీట్ బలంగా ఉందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ చార్జీషీట్ లో ప్రధానంగా కవిత పొందిన లాభాలను ప్రస్తావించింది ఈడీ. లిక్కర్ దందా లాభాలతో కవిత హైదరాబాద్ లో భూములు కొన్నట్లు పేర్కొన్న ఈడీ…ఆమె భూములను ఎలా కొన్నారు..?ఎంతకు కొన్నారు..? ఎవరి ద్వారా ఈ భూముల కొనుగోలు జరిగిందనే విషయాలను చార్జీషీట్ లో పొందుపరిచింది.

Advertisement

మద్యం కుంభకోణంలో కవిత పాత్ర, ఇతర నిందితుల పాత్రకు సంబంధించిన సమాచారాన్ని కవిత ఫోన్ల నుంచి సేకరించడంతోపాటు…కవిత విశ్వసించిన బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్ళైలు అన్ని వివరాలను ఈడీకి చెప్పడం వలెనే సాధ్యమైందని అంచనా వేస్తున్నారు. ఇటీవల బుచ్చిబాబు అప్రూవర్ అయ్యాడన్న లీకులు వచ్చాయి. ఈ లీక్ ఈడీనే ఇచ్చింది. కవిత ఆర్ధిక వ్యవహారాలు, లిక్కర్ స్కామ్ లాభాలు, పెట్టుబడులు, కవిత భూముల కొనుగోలు వివరాలను బుచ్చిబాబుబయటపెట్టినట్లుగా తాజాగా ఈడీ దాఖలు చేసిన చార్జీషీట్ తో స్పష్టమైంది.

Advertisement

అరుణ్ రామచంద్ర పిళ్ళై కూడా ఈడీ విచారణలో అన్ని విషయాలను కక్కేశాడని అంటున్నారు. బుచ్చిబాబు, పిళ్ళైలు ఇద్దరూ కవిత పాత్ర గురించి వివరాలు చెప్పడంతోనే పక్కా ఆధారాలతో చార్జీషీట్ ను ఈడీ దాఖలు చేసినట్లు కనిపిస్తోంది. తన పేరు మీద నడుస్తోన్న కంపెనీలు తనవి కావని.. కవితవెనన్ని చెప్పిన పిళ్ళై ఇటీవల ఇచ్చిన సమాచారంతో ఈ కేసులో బలమైన ఆధారాలను సేకరించి కవిత పాత్రను నిగ్గు తేల్చే పనిలో పడింది ఈడీ. చార్జీషీట్ ను చూస్తుంటే మద్యం కుంభకోణంలో కవిత పాత్ర లేదనుకోవడానికి లేదు. కాబట్టి ఆమె అరెస్ట్ నుంచి తప్పించుకోవడం అసాధ్యమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Advertisement