Khairatabad Ganesh 2023 : వినాయక చవితి వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాలలో చర్చ మొత్తం ఖైరతాబాద్ గణేశుని విగ్రహం గురించి ఉంటుంది. ఈ క్రమంలో ఈసారి ఎన్ని అడుగుల విగ్రహం ప్రతిష్టించనున్నారు , ఏ రూపంలో గణేశుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు అని చర్చ సాగుతుంది. అయితే తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఒక్కరు ఖైరతాబాద్ గణేష్ ని దర్శించుకునేందుకు వెళుతూనే ఉంటారు. ఇలా ప్రతి సంవత్సరం గణపయ్యను దర్శించుకునేందుకు భక్తుల తాకిడి పెరుగుతూనే ఉంది. భారతదేశంలోని హైదరాబాదులోని ఖైరతాబాద్ లో గణేశ చతుర్థి వార్షిక పండుగ సందర్భంగా ప్రత్యేక గణేష్ ని ప్రతిష్టిస్తారు.
అయితే ఇక్కడ విగ్రహం ఎత్తు మరియు చేతిలో పట్టుకునే లడ్డు కు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఖైరతాబాద్ గణేశుడు ఇంతలా ప్రసిద్ధి చెందడానికి గల కారణం కూడా ఇవే అని చెప్పవచ్చు. ప్రతిరోజు వేలాది మంది సందర్శించే పది రోజుల పండుగ సందర్భంగా భక్తిశ్రద్ధలతో విగ్రహాన్ని పూజిస్తారు. ఇక 11వ రోజు సమీపంలో గల హుస్సేన్ సాగర్ సరస్సులో నిమజ్జనం చేస్తారు. అయితే బాలగంగాధర్ తిలక్ ప్రేరణతో సింగరి శంకరయ్య1954లో ఖైరతాబాద్ లో ని ఒక ఆలయంలో ఒక అడుగు వినాయకుడు విగ్రహాన్ని మొదటిసారిగా స్థాపించారు.
అప్పటినుండి ప్రతి సంవత్సరం అక్కడ వినాయకున్ని ప్రతిష్టిస్తూ వస్తున్నారు. అయితే 1954 నుండి 2014 వరకు విగ్రహం ఎత్తు క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇలా ప్రతి ఏడాది ఒక అడుగు పెరుగుతూ 2019లో విగ్రహం ఎత్తు 61 అడుగులకు చేరింది. తద్వారా ఆ సంవత్సరంలో భారతదేశంలోనే అత్యంత ఎత్తైన గణేష్ ని విగ్రహంగా అవతరించింది. ఇక అక్కడి నుండి క్రమంగా తగ్గించడం మొదలుపెట్టారు. అంతేకాక హుస్సేన్ సాగర్ సరసుకు మార్గం యొక్క పరిమితిలు మరియు పర్యావరణ సమస్యల కారణంగా పరిమాణాన్ని తగ్గిస్తూ వస్తున్నారు. అంతేకాక ఈ ఏడాది మొత్తం మట్టితో విగ్రహాన్ని తయారుచేసి ప్రపంచ రికార్డును నెలకొల్పారు.