Viral News : చిన్నతనం నుండి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన కూతురికి బ్రతికుండగానే ఓ తండ్రి పెద్దకర్మ చేశాడు. ఓ ఫ్లెక్సీ వేసి మరి పెద్ద కర్మ నిర్వహించాడు. అయితే వినడానికి వింతగా ఉన్న ఇది నిజం. అయితే ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే…. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ తండ్రి తన కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. విద్యాబుద్ధులు నేర్పించాడు. అలాగే తన కూతురు పెళ్లిని తన ఇష్ట ప్రకారంగా పెద్దల సలమక్ష్యంలో జరిపించారు.
ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో కనుల విందుగా వివాహం జరిపించారు. ఇక ఇప్పటివరకు అంత సవ్యంగానే జరిగింది. కానీ పెళ్లయిన తర్వాత పెళ్ళికొడుకు కు బోన్ క్యాన్సర్ ఉన్నట్లుగా పెళ్లికూతురు నందిని కు తెలిసింది. దీంతో వెంటనే అక్కడినుండి పుట్టింటికి వచ్చేసింది. అంతేకాక తాను ప్రేమించిన యువకుడుతో కలిసి ఇంట్లో నుండి వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహించిన తండ్రి తన కూతురు చనిపోయినట్లుగా ప్లెక్స్ తయారు చేపించి పెద్ద కర్మ నిర్వహించారు. నిజంగానే చనిపోయిందనుకొని బంధువులు సైతం వచ్చారు.
తీరా వచ్చి చూశాక ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కూతురు కోసం ఎంతో చేసిన తండ్రి తాను చేసిన పెళ్లి పేటకులవడం , మరోవైపు కూతురు తను ప్రేమించిన వాడితో లేచిపోవడం తండ్రి జీర్ణించుకోలేకపోయారు. దీంతో కూతురు బతికుండగానే పెద్ద కర్మ నిర్వహించాడు. తండ్రి ఇలా చేయడం చూసి బంధువులు సైతం ఆశ్చర్యపోయారు. ఏది ఏమైనా తన కూతురిపై ఉన్న ప్రేమను ఎలా వ్యక్తం చేయాలో తెలియక ఇలా తన కోపాన్ని తీర్చుకున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. కూతురు తాను ప్రేమించిన వ్యక్తి గురించి తండ్రికి చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకుంటే బాగుండేదని స్థానికులు అంటున్నారు.