కొల్లాపూర్ లో హర్షవర్ధన్ రెడ్డిని డీకొట్టడం కేతూరికే సాధ్యమా..?

మాజీ మంత్రి, బీఆర్ఎస్ బహిష్కృత నేత జూపల్లి కృష్ణారావు తిరిగి కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. జూపల్లి కాంగ్రెస్ లో చేరితే టికెట్ ఆయనకే దక్కే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తోన్న ఓబీసీ నేషనల్ కో- ఆర్డినేటర్ డా. కేతూరి వెంకటేష్ తోపాటు చింతలపల్లి జగదీశ్వర్ ల పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది.

Advertisement

చింతపల్లి జగదీశ్వర్ రావులు రాష్ట్రస్థాయిలో టికెట్ కోసం లాబియింగ్ చేస్తుండగా.. కేతూరి వెంకటేష్ మాత్రం రాష్ట్రస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు లాబియింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కేతూరి ఢిల్లీ పెద్దలతోనూ సన్నిహిత సంబందాలు ఉన్నాయి. భారత్ జోడో యాత్రిగా రాహుల్ గాంధీతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు తిరిగారు. అప్పుడు రాహుల్ తో బీసీల అస్తిత్వం- పార్టీలో అవకాశాలు అనే అంశంపై చర్చించినట్లు గతంలో కేతూరి వివరించారు. రాష్ట్ర స్థాయిలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ, కేవీపీ లాంటి నేతల అండదండలు కేతూరికి పుష్కలంగా ఉన్నాయి.

Advertisement

భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొల్లాపూర్ లో కొనసాగింది. అప్పుడు ఆ నియోజకవర్గంలో కేతూరిని ప్రధాన నాయకుడిగా చూపించేలా భట్టి విక్రమార్క చొరవ తీసుకున్నారు. మరోవైపు..1962తరువాత కొల్లాపూర్ నుంచి ఇప్పటివరకు బీసీ అభ్యర్థికి కాంగ్రెస్ పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓటు బ్యాంక్ 93శాతంపైగానే ఉంది. కాబట్టి బీసీ కోటాలో తనకు టికెట్ కేటాయించాలని కేతూరి పట్టుబడుతున్నారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మూడుచోట్ల(మహబూబ్ నగర్, షాద్ నగర్, కల్వకుర్తి)లో బీఆర్ఎస్ బీసీ అభ్యర్థులకు టికెట్ కేటాయించింది. కానీ కాంగ్రెస్ మాత్రం ఎక్కడ బీసీలకు టికెట్ కేటాయించలేదు తద్వారా బీసీ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ నుంచి చేజారే అవకాశం ఉంది. సీనియర్ నేత జూపల్లి వస్తే ఆయన సేవలను మరోలా ఉపయోగించుకొని, ఓయూ విద్యార్ధి ఉద్యమకారుడిగా, బీసీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ హై కమాండ్ ను కేతూరి కోరనున్నట్లు తెలుస్తోంది.

నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో రెండు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉండగా ఐదు జనరల్ స్థానాల్లో పది లక్షలకుపైగా బీసీ జనాభా ఉంది. ఈ ఐదు జనరల్ స్థానాల్లో కనీసం రెండు స్థానాల్లోనైనా బీసీలకు టికెట్ ఇవ్వాలి. జనరల్ స్థానాల్లో బీసీలకు కూడా అవకాశం ఇవ్వాలని రాయ్ పూర్, ఉదయ్ పూర్ చింతన్ శిబిర్ లో కాంగ్రెస్ చేసిన తీర్మానానికి పార్టీ ఆమోదం తెలిపింది. ఈ లెక్కన కొల్లాపూర్ కాంగ్రెస్ టికెట్ కేతూరికి దక్కే అవకాశం మెండుగా ఉంది. దాదాపు రెండు దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేస్తున్నారు కేతూరి. ఎన్ఎస్ యూఐ ఓయూ అద్యక్షుడిగా,  కొల్లాపూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అద్యక్షుడిగా, రాజీవ్ గాంధీ పంచాయితీ రాజ్ సంఘటన్ కో ఆర్డినేటర్ గా , పీసీసీ రాష్ట్ర కార్యదర్శిగా కేతూరి పార్టీ కోసం పని చేశారు.

నియోజకవర్గాల ప్రజలతోనూ కేతూరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రెండేళ్లుగా ఆయన నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. బీరం హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ వీడిన తరువాత కేతూరి వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ కార్యక్రమాలను జనాల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో హర్షవర్ధన్ రెడ్డితో కలిసి పని చేసిన అనుభవం ఉండటంతో ఆయన వ్యూహాలకు చెక్ పెట్టి కొల్లాపూర్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరయాలంటే కేతూరి తోనే సాధ్యమని స్థానిక నాయకులు అభిప్రాయపపడుతున్నారు.

Advertisement