వైఎస్సార్ టీపీ విలీనానికి షర్మిల మొగ్గు..!?

వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనమా..? కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకుంటుందా..? అనే అంశంపై జరుగుతోన్న చర్చకు ఎట్టకేలకు ముగింపు పడనుంది. డీకే శివ కుమార్ , కేవీపీల సూచన మేరకు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకే వైఎస్ షర్మిల మొగ్గు చూపినట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ ద్వారా షర్మిల రాజకీయం చేసేందుకు రేవంత్ రెడ్డి నిరాకరించగా… వైఎస్సార్ వారసురాలు పార్టీలోకి వస్తానంటే వద్దనడం సరైంది కాదని…ఆమెకు పాలేరు సీటు ఇస్తే సరిపోతుందని హైకమాండ్ రేవంత్ కు సర్ది చెప్పినట్లు పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది.

Advertisement

షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని ఉదృతంగా ప్రచారం జరుగుతోన్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా ఆయనకు ట్విట్టర్ వేదికగా బర్త్ డే శుభాకాంక్షలు తెలిపింది. గతంలో తన తండ్రి మరణానికి సోనియా కుట్ర పన్నారని సంచలన ఆరోపణలు చేసినా ఆమె రాహుల్ గాంధీని కూడా కించపరచారు. కానీ ఇప్పుడు ఆయన నాయకత్వం దేశానికి అవసరముందనే రీతిలో ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.

Advertisement

షర్మిల ట్వీట్ తో వైఎస్సార్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని అందరికీ ఓ స్పష్టత వచ్చేసింది. ప్రస్తుత పరిస్థితుల నడుమ ఆమె సేవలను తెలంగాణలోనే వాడుకుంటారని భవిష్యత్ లో షర్మిలను ఏపీ బాధ్యతలు చూసుకోమని సూచించే అవకాశం ఉందంటున్నారు.ఏపీలో జగన్ కారణంగా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ వైసీపీకి బదిలీ అయింది కనుక ఆ ఓటు బ్యాంక్ తిరిగి కాంగ్రెస్ కు చేరవ కావాలంటే షర్మిలకు ఏపీ పీసీసీ అద్యక్ష బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.

Advertisement