Ravindar Chandrasekaran : కోలీవుడ్ ప్రముఖ నిర్మాత అరెస్ట్….

Ravindar Chandrasekaran : కోలీవుడ్ ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేకరన్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. అయితే గత సంవత్సరం సింగర్ మహాలక్ష్మిని ఆయన పెళ్లి చేసుకున్న దగ్గర నుండి ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. అయితే తాజాగా నిర్మాత రవీందర్ చిక్కుల్లో పడినట్లు అర్థమవుతుంది. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నిర్మాత రవీందర్ ను అరెస్ట్ చేశారు. ఓ బడా వ్యాపారవేత్తను మోసం చేసినందుకుగాను రవీందర్ అరెస్టు అయినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్లో సంచలనంగా మారింది. ది హిందూ ప్రకారం ఘన వ్యర్ధాల నుండి ఓ ప్రాజెక్టు పెట్టుబడి పెట్టి గణనీయమైన లాభాలను పొందవచ్చని ఓ వ్యక్తిని నమ్మించగలిగాడు.

Advertisement

kollywood-famous-producer-arrested

Advertisement

ఇక దానికి కావాల్సిన నకిలీ పత్రాలను సిద్ధం చేసి చెన్నైకి చెందిన బాలాజీ అనే వ్యక్తిని ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యని చేసుకున్నాడు. అందుకుగాను అతని దగ్గర నుండి 15.83కోట్లు తీసుకున్నారు. ఇక ఈ ఒప్పందం వీరిద్దరి మధ్య సెప్టెంబర్ 17 2020లో జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. అయితే రవీందర్ మొదట చెప్పిన వాగ్దానాలను నిరూపించడంలో విఫలమయ్యాడు . దీంతో తన డబ్బు తనకు తిరిగి ఇవ్వాలని బాలాజీ రవీందర్ ని కోరాడు. ఎన్నిసార్లు అడిగినా రవీందర్ నుండి సరైన సమాధానం రాలేదని తెలుస్తోంది. దీంతో రవీందర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలాజీ నిర్ణయించుకున్నారు. రవీందర్ చేసిన మోసపూరిత కార్యకలాపాలతో పాటు ఆర్థిక అవకతవకలను వివరిస్తూ చెన్నైలోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ లో బాలాజీ ఫిర్యాదు చేశాడు.

kollywood-famous-producer-arrested

ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో రవీందర్ ను అరెస్టు చేసి పోలీసులు విచారిస్తున్నారు. లిబ్రా ప్రొడక్షన్ బ్యానర్ పై రవీందర్ పలు రకాల సినిమాలను నిర్మించి కొలీవుడ్ లో మంచి గుర్తింపు సాధించాడు. ఆ తర్వాత బుల్లితెర నటి మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లితో మీడియా మరియు ప్రతి ఒక్కరి చూపు వీరిని ఆకర్షించింది. అయితే రవీందర్ చంద్రశేఖరన్ ఇప్పటికే పలు రకాలు వివాదాల్లో ఇరుక్కున్నారు. గతంలో కూడా విజయ్ అనే తన స్నేహితుడి నుండి 15 లక్షల రూపాయలు తీసుకొని ఓ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని కేసు కూడా రవీంద్ర పై ఉంది.

Advertisement