Vijay Deverakonda – Rashmika : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మరోవైపు రష్మిక కూడా షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం రష్మిక చేతిలో రెండు పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే ఈమధ్య తన అసిస్టెంట్ పెళ్లిలో కనిపించిన రష్మిక చీరలో సందడి చేసింది. ఇక ఈ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులకు షేర్ చేసింది. అయితే ఈ ఫోటోల సహాయంతో నేటిజనులు కొత్త విషయాన్ని కనిపెట్టారు. గీత గోవిందం సినిమాలో రష్మిక మరియు విజయ్ దేవరకొండ కలిసి నటించిన విషయం తెలిసిందే.
ఆ సినిమా హిట్ అవడం ఏమో కానీ వీరిద్దరి పేరు మాత్రం మారుమోగింది. ఇక అప్పటినుండి వీరిద్దరి మధ్య ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకుంటారని వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తమ మధ్య స్నేహం తప్ప ఇంకేమీ లేదని రష్మిక ఆమధ్య క్లారిటీ ఇచ్చింది. మేమిద్దరం స్నేహితులం మాత్రమే అని విజయ్ రష్మిక చెప్పిన ఎవరు నమ్మడం లేదు.
View this post on Instagram
అయితే ఇటీవల చీరలో రష్మిక షేర్ చేసిన ఫోటోలు విజయ్ దేవరకొండ ఇల్లు ఉన్నట్లుగా గుర్తించారు. ఎందుకంటే విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన ఫోటోలలో మరియు రష్మిక షేర్ చేసిన ఫోటోలలో వెనకాల ఉన్న గోడ ఒకేలా ఉంది. ఇక దీనిని నేటి జనులు కనిపెట్టారు. దీంతో విజయ్ ఇంటికి రష్మిక సరదాగా వెళ్ళిందా లేక వీరిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారా అనే కొత్త డౌట్స్ అభిమానుల్లో మొదలైంది. ఇక దీనిలో నిజం ఎంత ఉందో తెలియాలంటే వీరిద్దరిలో ఒకరు ఈ వార్తలకు స్పందించాల్సిందే.
View this post on Instagram