Naresh Pavitra Lokesh : మళ్లీ ముద్దులతో రెచ్చిపోయిన నరేష్ పవిత్ర లోకేష్ ….

Naresh Pavitra Lokesh : ఒకప్పటి హీరో మరియు నటుడు నరేష్ అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ ఈ వయసులో కూడా ప్రేమలో మునిగి తేలుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల వీళ్లిద్దరూ కలిసి మళ్లీ పెళ్లి అనే సినిమాను కూడా తీశారు. ఈ విషయాలన్నీ అందరికీ తెలుసు. అయితే సినీ ఇండస్ట్రీలో వీరిద్దరి ప్రేమ వ్యవాహారం ఎంతటి దుమారాన్ని లేపిందో చెప్పాల్సిన పని లేదు. అయితే తాజాగా వీరిద్దరూ కలిసి మరోసారి తెలుగు టీవీ షోలో కనిపించారు. ఇక ఈ షోలో పవిత్ర లోకేష్ నరేష్ కి ముద్దు పెట్టి మరి తానే ముద్దు పెట్టినట్లు తెలియజేసింది.అయితే వినాయక చవితి సందర్భంగా స్వామి రారా అనే ప్రోగ్రామ్ ను ఈటీవీ నిర్వహించడం జరిగింది.

Advertisement

ఇక వినాయక చతుర్థి సందర్భంగా ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేయనున్నారు.  అయితే ఈ షో కి నరేష్ పవిత్ర లోకేష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. హోస్ట్ గా శ్రీముఖి మరియు హైపర్ ఆది వ్యవహరించారు. వీరితో పాటు ఈ షోలో పలువురు బుల్లితెర ఆర్టిస్టులు కూడా పాల్గొన్నారు.ఇక ఈ షో కి సంబంధించిన ప్రోమోనో ఇటీవల ఈటీవీ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ షోలో మొదటి పూజ ఎవరు చేయాలని ఆర్టిస్టు మధ్య గొడవలు జరిగాయి. ఇక దీనికి పరిష్కారంగా ఓ సెన్సేషనల్ కపుల్స్ ని అరేంజ్ చేశారని శ్రీముఖితో బలగం వేణు చెప్పగానే వెంటనే వేదికపైకి నరేష్ మరియు పవిత్ర లోకేష్ వచ్చారు.

Advertisement

ఇక ఇదే షోలో గులాబీ పువ్వు ఇచ్చి నరేష్ పవిత్రకు ప్రపోజ్ చేసినట్టుగా చూపించారు. నరేష్ ప్రపోజ్ చేయడం చూసి ఫిదా అయిన పవిత్ర వెంటనే నరేష్ చెంపపై ముద్దు పెట్టింది.ఆ తర్వాత హోస్ట్ గా వ్యవహరిస్తున్న శ్రీముఖి మీరు నరేష్ ను ముద్దుగా ఏమని పిలుస్తారని అని పవిత్రను అడగగా రాయ పిలుస్తారని తెలిపింది. అయితే నరేష్ బిరుదు నవరసరాయ అని మనందరికీ తెలుసు. ఒక దానిలోని చివరి అక్షరాన్ని ఇలా తీసుకున్నట్లుగా పవిత్ర చెప్పింది. దీంతో ప్రస్తుతం ఈ షో కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నరేష్ పవిత్ర లోకేష్ పేర్లు మరోసారి సోషల్ మీడియా వేదికగా తెగ వినిపిస్తున్నాయి.

Advertisement