Niharika : తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా డాటర్ గా పేరు సంపాదించుకున్న నిహారికకు ప్రేక్షకులలో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా నిహారికకు చాలామంది అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే నిహారిక ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే హీరోయిన్ గా నిహారిక చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవడంతో సినీ ఇండస్ట్రీకి బాయ్ చెప్పి జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లయిన రెండేళ్లకే విడాకులు తీసుకుంది. ఈ విషయాన్ని చైతన్య మరియు నిహారిక అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
అప్పటినుండి సోషల్ మీడియాలో సింగిల్ ఫొటోస్ పోస్ట్ చేసి అభిమానులను ఉత్సాహపరస్తు వస్తుంది. అయితే రీసెంట్ గా నిహారిక తన అన్నలకు రాఖీ కట్టిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. తాజాగా నిహారిక మరో పోస్ట్ చేసింది. నిహారిక పెట్టిన పోస్ట్ మెగా అభిమానులకు మరో కొత్త డౌట్లు క్రియేట్ చేస్తుంది. విడాకుల అనంతరం బాడీ ఫిజిక్ పై దృష్టి పెట్టిన నిహారిక జిమ్ లో గంటలు గంటలు వ్యాయామం చేస్తూ బాడీ షేప్ ను మార్చుకుంటుంది. దీనికి సంబంధించిన వీడియోలను ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది.
ఈ క్రమంలో ఇటీవల నిహారిక జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోను షేర్ చేస్తూ లాస్ట్ వర్కౌట్ ఇన్ హైదరాబాద్ అని రాస్కొచ్చింది. అంటే నిహారిక ఇప్పుడు హైదరాబాద్ విడిచి వెళ్ళిపోతుందా అన్న డౌట్ ప్రతి ఒక్కరిలో మొదలైంది. అయితే విడాకుల అనంతరం నిహారికపై వివిధ రకాల వాదనలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో తన ఫ్యామిలీ కూడా తనకు అండగా నిలవలేకపోయింది. నాగబాబు అయితే ఏకంగా మాట్లాడడమే మానేసారట. దీంతో విడాకుల అనంతరం నిహారిక ఒంటరిగానే జీవిస్తూ వస్తుంది. ఇక ఇప్పుడు ఫారిన్ కంట్రీ కి వెళ్లేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తుంది. దీంతో నిహారిక మెగా ఫ్యామిలీకి దూరంగా వెళ్తుంది అన్న న్యూస్ వైరల్ గా మారింది. ఇక ఈ వార్తలపై నిహారిక స్పందిస్తే కానీ నిజ నిజాలు బయటపడవు.