R.S Sivaji : సినీ ఇండస్ట్రీలో విషాదం….ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత…

R.S Sivaji :సినీ పరిశ్రమలో ఈ మధ్య వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. అలనాటి నటీనటులు కాలం చెల్లించడంతో ప్రతి సినీ ఇండస్ట్రీ మూగబోతుంది. అయితే తాజాగా సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ నటుడు కమెడియన్ ఆర్.ఎస్ శివాజీ కన్నుమూశారు. అయితే ఆయన ఇటీవల కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో నటించి మెప్పించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల కన్నుమూశారు. దీంతో సినీ పరిశ్రమ ఓ కమెడియన్ ను కోల్పోయింది. ఆర్ఎస్ శివాజీ మృతికి సినీ పరిశ్రమలోని వారంతా సంతాపం తెలియజేస్తున్నారు. చివరిసారిగా ఆయన పార్థివ దేహాన్ని చూసేందుకు ప్రతి ఒక్కరు తరలివస్తున్నారు.

Advertisement

అయితే ఈయన తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు. కాని తమిళ ప్రేక్షకులకు మాత్రం అత్యంత సుపరిచితమైన వ్యక్తి. తమిళ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. ఎన్నో వందల సినిమాలు నటించిన శివాజీ గారికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే ఆర్ఎస్ శివాజీ అక్టోబర్ 26 1956 లో జన్మించారు. చెన్నైలోనే పుట్టి పెరిగిన ఈయన సినిమా రంగంపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కేవలం నటుడి గానే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా , సౌండ్ ఇంజనీర్ గా, లైటింగ్ ప్రొడ్యూసర్ గా కూడా పలు సినిమాలలో పనిచేశారు. అలాగే పలు టెలివిజన్ షో లలో కూడా పాల్గొనేవారు. అయితే తెలుగులో జగదేకవీరుడు అతిలోకసుందరి , 1000 అబద్దాలు వంటి సినిమాలలో నటించారు.

Advertisement

అలాగే కమల్ హాసన్ తో కలిసి గుణ, నాయకుడు , సత్యం , శివం , విక్రమ్ వంటి పలు సినిమాలలో కనిపించి అలరించారు. ఇక సూర్యతో కలిసి యువ , ఆకాశం నీ, హద్దురా వంటి సినిమాల్లో కలిసి నటించారు. అలాగే ఇటీవల సాయి పల్లవి నటించిన గార్గి సినిమాలో కూడా శివాజీ ఓ పాత్ర పోషించారు. అయితే గత కొంతకాలంగా శివాజీ ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఆయన కన్నుమూశారు. ఇక శివాజీ మృతితో తమిళ్ సినీ పరిశ్రమతో పాటు ఆయన అభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన మృతికి సినీ ప్రముఖులందరూ సంతాపం తెలుపుతున్నారు. చివరిసారిగా ఆయన పార్థివదేహాన్ని చూసేందుకు తెలుగు సినీ ప్రముఖులు సైతం తరలివచ్చారు. ఆయన పార్తివదేహానికిి పూలమాలవేసి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నారు.

Advertisement