Music Director Siva Kumar : ర్రోడ్డు ప్రమాదంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మృతి…

Music Director Siva Kumar  : తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రముఖ దక్షిణాది సంగీత దర్శకుడు శివకుమార్ కన్నుమూశారు.తన స్నేహితులతో కలిసి కేరళ నుండి చెన్నైకి కారులో ప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తిరువూరు జిల్లా అవినాసి టౌన్ సమీపంలోకి రాగానే కారు యొక్క ముందు టైరు అకస్మాత్తుగా పేలింది. దీంతో అదుపు తప్పిన కార్ పక్కనే ఉన్న డివైడర్ ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. ఇక ఈ ప్రమాదం అంతా క్షణాల్లో జరిగిపోయిందని స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రమాద సమయంలో కారును శివకుమార్ స్నేహితుడు అడియన్ నడుపుతున్నారు.

Advertisement

popular-music-director-dies-in-a-road-accident

Advertisement

రెప్పపాటులో జరిగిన ఈ ప్రమాదంలో శివకుమార్ మరియు అతని స్నేహితుడు అడియన్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు స్నేహితులు నాగరాజు మరియు మువిందన్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే తమిళ్ మరియు మలయాళం , ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు శివకుమార్ సంగీతం అందించారు. అంతేకాక మలయాళంలో గంగారకి అనే సినిమాకు గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా కేరళ ప్రభుత్వం నుండి పురస్కారం పొందారు.

popular-music-director-dies-in-a-road-accident

ఇక తమిళ్ ఇండస్ట్రీలో బాణీలు కట్టిన , ఉత్త వీడు, ఆడవార్, సతనాయి , పయనం వంటి సినిమాలు మంచి ఆదరణ పొందాయి. శివకుమార్ మరణంతో సినీ ఇండస్ట్రీ ఓ సంగీత దర్శకుడుని కోల్పోయింది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వరుసగా జరుగుతున్న మరణాలతో మరోసారి సిని ఇండస్ట్రీ మూగబోయింది. అయితే ఇటీవల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ కమెడియన్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ విషాద ఘటన నుండి సినీ ఇండస్ట్రీ తేరుకొక ముందే మరో విషాదం చోటు చేసుకుంది.

Advertisement