Viral video : అక్కని పెళ్లి చేసుకున్న తమ్ముడు…చివరికి ఏం జరిగిందంటే…

Viral video  : ప్రేమ ఎప్పుడూ ఎవరి మధ్య ఎలా చిగురుస్తుందో చెప్పడం చాలా కష్టం . అయితే తాజాగా వరుసకి అక్క తమ్ముడు అయినటువంటి ఇద్దరి మధ్యన ప్రేమ చిగురించింది. ఇక వారి ప్రేమ ను పెద్దలు అంగీకరించరని తెలిసి వారు ఏం చేస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సింది. అయితే ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానిక జిల్లాలోని గులక చర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన మమత అనే అమ్మాయి ఉంటుంది. ఇక అమ్మాయి స్థానికంగా ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ లో డిగ్రీ చదువుకుంటుంది.

Advertisement

అయితే ఈ ప్రాంతంలోనే ప్రశాంత్ అనే యువకుడు నివసిస్తున్నారు. ఇక ఇతను స్థానికంగా చిన్న చిన్న పనులను చేసుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే వీరిద్దరూ వరుసకి అక్క తమ్ముళ్లవుతారు. వయసులో ప్రశాంత్ కంటే మమత ఒక సంవత్సరం పెద్దది. అయినప్పటికీ తనకంటే చిన్నవాడైన ప్రశాంత్ ని ప్రేమించింది. దీంతో స్థానికుల నుండి ఈ సమాచారాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు వీరిద్దరిని మందలించారు. ప్రశాంత్ ని అక్కడ ఉండ నివ్వకుండా కుటుంబ సభ్యులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి పంపించారు. ప్రశాంత్ హైదరాబాదులో సెంట్రింగ్ పనులను చేసుకుంటున్నాడు.

Advertisement

అయినా కూడా తన కుటుంబ సభ్యులకు తెలియకుండా మమతతో గుట్టుగా ప్రేమాయణం సాగించాడు. అయితే తాజాగా మమత తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ప్రశాంత్ ని కోరింది. కానీ ఇలా చేస్తే కుటుంబ సభ్యులు తమని బ్రతకనివ్వరని , అలాగే బ్రతికుండగా ఇద్దరు కలిసి ఉండలేమని , కనీసం చావులోనైనా ఒకరికి ఒకరు తోడుందామని ఇద్దరు కలిసి ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అయితే వీరిని గమనించిన స్థానికులు ఇద్దరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇక అప్పటికే ప్రశాంత్ మమత ఇద్దరు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement