Sara Tendulkar : వన్డే వరల్డ్ కప్ 2023 లో భాగంగా టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సెమీస్ పై కన్నేసిన భారత్ 12 పాయింట్ల తో టేబుల్ టాపర్ గా నిలిచింది. అయితే అధికారికంగా సెమీస్ కు చేరకపోయినా వరుసగా ఆరు విజయాలతో టీమ్ ఇండియా మరో ఆసక్తికరమైన పోరుకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో అమి తుమి తేల్చుకొనుంది . ముంబైలోని వాంఖడై మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇక శ్రీలంకతో జరగబోయే పోరులో ఎలాగైనా విజయం సాధించి సెమీస్ కు టికెట్ అందుకోవాలని భారత్ ఎదురుచూస్తుంది.
ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా ప్లేయర్ ఓపెనర్ బ్యాట్స్ మెన్ శుబ్ మన్ గిల్ వార్తల్లో నిలిచారు. తాజాగా శుబ్ మన్ గిల్ తన రూమర్ గర్ల్ ఫ్రెండ్ సారా టెండుల్కర్ తో కనిపించడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యారు. అయితే ఇటీవల జియో ప్లాజా ఈవెంట్ లో భాగంగా శుబ్ మన్ గిల్ మరియు సారా టెండూల్కర్ కలిసి కనిపించడంతో దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోలో గమనించినట్లయితే హోటల్ నుంచి ఇద్దరు కలిసి వస్తుండగా మీడియాను చూసిన గిల్ ఒక్కసారిగా ఆగిపోయాడు.
ఈ నేపథ్యంలోనే ముందుగా సారా టెండూల్కర్ ను పంపించి తర్వాత శుబ్ మన్ గిల్ బయటకు వచ్చాడు. ఇక ఈ కార్యక్రమంలో గిల్ బ్లాక్ టు బ్లాక్ లో కనిపించగా సారా టెండూల్కర్ రెడ్ కలర్ డ్రెస్సు లో మెరిసిపోయింది. అయితే మరోసారి ఈ జోడి మీడియాకు చిక్కడంతో వారిపై నేటిజనులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇద్దరి మధ్య మళ్ళీ ప్రేమ మొదలైందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో దీనికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
View this post on Instagram