Varun Lavanya : వరుణ్ పెళ్లి ఫోటోలు షేర్ చేసిన చిరంజీవి…ఎవరెవరు ఉన్నారంటే…

Varun Lavanya  : మెగా హీరో వరుణ్ తేజ్ మరియు హీరోయిన్ లావణ్య త్రిపాఠి నవంబర్ 1వ తేదీన ఇటలీలోని టాస్కని అనే పురాతన గ్రామంలో వేదమంత్రాలసాక్షిగా వైవాహిక బంధం లోకి అడుగుపెట్టారు. ఇక వీరి వివాహ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఇక ఈ వేడుకలలో మెగా మరియు అల్లు కుటుంబాలు సందడి చేశారు. అంతేకాక పెళ్లికి ముందు జరిగిన కాక్ టైల్ పార్టీ , మెహందీ ఫంక్షన్ , మరియు హల్దీ వేడుకలకు , సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక ఈ వేడుకలలో మెగా కుటుంబంతో పాటు సినీ సెలబ్రిటీలు అతి తక్కువ మంది మాత్రమే హాజరయ్యారు.

Advertisement

chiranjeevi-shared-varuns-wedding-photos-viral-photos

Advertisement

ఈ క్రమంలోనే తాజాగా వరుణ్ లావణ్య దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా వేదికగా ఫోటోలను షేర్ చేశారు. ఇక ఈ ఫోటోలో మెగా మరియు అల్లు ఫ్యామిలీ హీరోలు అందరూ ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు అల్లు అర్జున్ ,పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ , నాగబాబు అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్ , వైష్ణవ తేజ్ ఉన్నారు. అయితే సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ షేర్ చేసిన ఈ ఫోటో అభిమానులు విపరీతంగా లైక్ కొడుతున్నారు. దీంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

chiranjeevi-shared-varuns-wedding-photos-viral-photos

అలాగే చిరు పోస్ట్ చేసిన ఈ ఫోటోను మెగా హీరోలు అందరూ షేర్ చేస్తూ కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈ పెళ్లిలో రామ్ చరణ్ ,అల్లు అర్జున్ మరియు హీరో నితిన్ దంపతులు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. అంగరంగ వైభవంగా పెళ్లి పనులు పూర్తవడంతో ఈరోజు కొత్త దంపతులు హైదరాబాద్ కు రానున్నారు. అనంతరం నవంబర్ 5వ తేదీన హైదరాబాదులోని మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో వరుణ్ లావణ్య రిసెప్షన్ జరగనుంది. ఇక ఈ రిసెప్షన్ వేడుకలకు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులందరూ రానున్నట్లు సమాచారం.

Advertisement