Hyderabad : నెట్టింట విషాదం .. చాటింగ్ పేరిట ఇద్దరు అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ .. చివరికి బలవంతంగా..

Hyderabad : ప్రస్తుతం సోషల్ మీడియాకు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. అయితే దీనిని ఉపయోగించుకొని చాలామంది చెడు పనులకు పాల్పడుతున్నారు. రోజురోజుకి నెట్టింటా సైబర్ క్రైమ్స్ హడలెత్తిస్తున్నాయి. తాజాగా చాటింగ్ అమ్మాయిలను ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేశారు. ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి వాళ్ల దగ్గర నుంచి ఫోటోలు తీసుకుని వాటిని మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. తర్వాత దారుణానికి వడిగట్టారు. అయితే అమ్మాయిల ప్రవర్తనను గమనించిన కుటుంబ సభ్యులు ఏంటా అని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. పేరెంట్స్ ఇచ్చిన ఫిర్యాదుతో అలర్ట్ అయిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Hyderabad: ఇద్దరమ్మాయిలకు ఫ్రెండ్ రెక్వెస్ట్.. చాటింగ్‌ పేరిట ఫోటోలు మార్ఫింగ్‌.. ఆ తర్వాత బలవంతంగా..

Advertisement

సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులు ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఈ మేరకు హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సిపి సందీప్ శాండిల్య ఈ కేసు కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నగరంలోని ఇద్దరు బాలికలకు వేరువేరుగా ఇద్దరు వ్యక్తుల నుంచి సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్ లు వచ్చాయి. అమ్మాయిలు యాక్సెప్ట్ చేయడంతో వారి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత బాలికలను నమ్మించి వీడియో చాటింగ్ చేసి వారికి తెలియకుండా నిందితులు రికార్డు చేశారు. ఆ తర్వాత వీడియోని మార్ఫింగ్ చేసి బాలికలను నగ్నంగా ఉన్నట్లు పంపించారు. వీటిని బయట పెట్టేస్తామని బెదిరించి వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు.

బాధితుల్లో ఓ బాలిక పరీక్షకు వెళ్లకుండా ఇంట్లోనే మౌనంగా ఉండటానికి గమనించిన పేరెంట్స్ ఏంటి అని ఆరా తీస్తే అసలు విషయం బయటకు వచ్చింది. వారు ఇచ్చిన ఫిర్యాదుతో నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. వారి నుంచి 30 వేల విలువైన మత్తు మాత్రలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవంటూ సిపి సందీప్ హెచ్చరించారు. అపరిచితులతో చాటింగ్ చేయవద్దని, ఎట్టి పరిస్థితుల్లో ఫోటోలు, వీడియోలు పంపొద్దు అన్నారు. ఎవరికైనా సరే వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు షేర్ చేయవద్దు అని సూచించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియోలకు తప్పనిసరిగా సెక్యూరిటీ లాక్ ఏర్పాటు చేసుకోవాలి అని అన్నారు. ఎవరైనా వేధింపులకు పాల్పడితే అమ్మాయిలు భయపడవద్దు డయల్ 100 కు ఫోన్ చేసి చెప్పాలన్నారు.

Advertisement