Diwali : దీపావళి రోజు ఈ పరిహారం చేస్తే కోటీశ్వరులు అవ్వడం ఖాయం…

Diwali : డబ్బు సంపాదించడానికి అలాగే దాచిపెట్టడానికి లక్ష్మీదేవి అనుగ్రహం కచ్చితంగా ఉండాలి. కొంతమంది ఎంత కష్టపడినా సరే ఇంట్లో వారి దగ్గర డబ్బు అసలు నిలవదు. లక్ష్మీదేవి కటాక్షం లేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే అలా జరగకుండా లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే దీపావళి రోజున ఖచ్చితంగా ఈ పరిహారాలు చేయాలని పండితులు చెబుతున్నారు. మరి ముఖ్యంగా ఉప్పుతో చేసే పరిహారం ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. ఈ పరిహారం చేశాక ఇంట్లో కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఈ పరిహారాలను పాటించినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంటుంది. ఇక ఆ నియమాలు ఏంటంటే ఇంటిని రోజు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో ఉండే గుమ్మాన్ని ఎప్పుడు శుభ్రంగా కడిగి పసుపు తో అలంకరిస్తూ ఉండాలి. అలాగే ఇంట్లో ఆడవారిని గౌరవిస్తూ సంతోషంగా ఉండాలి.

Advertisement

Vastu Tips to Diwali: దీపావళి పండగ తేదీ, శుభ ముహూర్తం.. లక్ష్మీ దేవిని ప్రసన్నం కోసం పాటించాల్సిన వాస్తు చిట్కాలు.. మీకోసం - Telugu News | Vastu Tips for Diwali: Date ...

Advertisement

ఇంట్లో అసలు గొడవలు పడకూడదు.  ఇలా గొడవలు పడడం వలన లక్ష్మీదేవి కటాక్షం పొందలేదు. అలాగే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు. అలాగే లక్ష్మీదేవి అని భావించే ప్రతి వస్తువులను కింద పడేయడం, తొక్కటం లాంటి పనులు చేయకూడదు. మరి ముఖ్యంగా పువ్వులు మరియు రూపాయి నాణేలను ఎలా పడితే అలా పడేయకూడదు. వీటిని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అలాగే చీపురికి కూడా చాలా ముఖ్యమైన ప్రాధాన్యత ఉంది. అలాంటి దానిని ఎక్కడపడితే అక్కడ పెట్టడం తొక్కటం లాంటి పనులు చేయకూడదు. ఇక ఉప్పు పరిహార విషయానికి వస్తే… ఒక మట్టి పాత్ర కానీ గాజుపాత్ర కాని తీసుకొని దానిలో నిండుగా గళ్ళ ఉప్పు వేసుకోవాలి. దానిపై పసుపు కుంకుమ వేసి ఒక రూపాయి కాయిన్ ఉంచాలి. ఇక దీనిని ఈశాన్యం మూలలో ఉంచాలి. మరి ముఖ్యంగా దీనిని గ్యాస్ స్టవ్ వద్ద ఎడమ వైపు పెట్టడం మంచిది.

ఇలా తయారుచేసి ఇంట్లో పెట్టడం వలన నెగటివ్ ఎనర్జీ పోతుంది. ఈ పరిహారాన్ని మనస్ఫూర్తిగా చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఈ పరిహారం చేసే సమయంలో భక్తిశ్రద్ధలతో నమ్మకంతో ప్రార్థించాలి. ఇక ఈ పాత్రను వారం రోజులు ఉంచి రంగు మారిన తర్వాత తీసివేయాలి. అయితే దీనిని తీసే సమయంలో మంగళవారం కానీ శుక్రవారం కానీ అసలు తీయకూడదు. ఇక ఈ ఉప్పును ఇంటికి చాలా దూరంగా పారెయాలి. ఇంటికి దగ్గరలో మాత్రం అస్సలు వేయకూడదు. ఇక దీనిలో ఉన్న రూపాయి కాయిన్ తులసి చెట్టు వద్ద వేయాలి. దీపావళి పండుగ రోజున ఈ పరిహారాన్ని చేసినట్లయితే ఆర్థిక సమస్యలు తొలగి తప్పకుండా మంచి ఫలితాలను పొందుతారు.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించాం. యువతరం దీనిని ధ్రువీకరించలేదు.

Advertisement