Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ 1975 మార్చ్ 15 న జన్మించాడు. పునీత్ అసలు పేరు లోహిత్ రాజ్ కుమార్, సినిమాల్లోకి వచ్చాక పునీత్ గా పేరు మార్చుకున్నాడు. 1985 లో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చి ఉత్తమ బాల నటుడిగా జాతీయ చలన చిత్రం అవార్డును సొంతం చేసుకున్నాడు. బాలనటుడిగా దాదాపు 14 సినిమాల్లో నటించాడు, పునీత్ పుడుతూనే స్టార్ ఎదుగుతున్న క్రమంలో తండ్రి రాజ్ కుమార్ కి నిజమైన వారసుడిగా కన్నడలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కన్నడ పవర్ స్టార్ గా మారడానికి పునీత్ చాలా కష్టపడ్డాడు, అతని జీవితం క్రమశిక్షణతో సాగింది.
పునీత్ రాజ్ కుమార్ 2002 లో అప్పు అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించడం విశేషం. ఈ సినిమాని తెలుగులో ఇడియట్ గా రీమేక్ చేశారు కూడా, ఈ చిత్రం కన్నడంలో ఓక ఊపు ఊపేసింది.అలా మొదటి సినిమాతోనే పునీత్ సూపర్ స్టార్ గా మారాడు. అనంతరం అభి, వీర, మౌర్య,ఆకాశ్ అజయ్, అరసు, మిలాన, వంశీ వంటి భారీ హిట్ ను సొంతం చేసుకొని వెండితెర మీద తిరుగులేని స్టార్ గా నిలిచాడు. పునీత్ కన్నడలో ఎక్కువగా మాస్ సినిమాలే చేశాడు.
Puneeth Rajkumar : కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు.
ఈ క్రమంలో అవార్డ్స్ అతనిని వెతుక్కుంటూ వచ్చేవి. కన్నడ నాట అత్యధిక కలెక్షన్స్ సాధించిన హీరోగా, అత్యధిక పారితోషకం అందుకున్న హీరోగానూ పునీత్ రికార్డును సృష్టించాడు. దాదాపు 20 ఏళ్ల కెరియర్లో 29 సినిమాలు చేశాడు. చివరగా యువరత్న సినిమాలో నటించాడు. కన్నడ చిత్ర సీమలో ఏ హీరోకి లేని ఘనత కూడా పునీత్ రాజ్ కుమార్ కే దక్కింది. అది ఆయన చిత్రాలన్నీ కన్నడలో సూపర్ హిట్ గా నిలిచాయి. పునీత్ కేవలం నటుడుగా మాత్రమే కాదు, ఆయనకి పాటలు పాడడం కూడా ఇష్టం.ఆయన 6 ఏళ్ల వయసు నుంచే సినిమాల్లో పాటలు పాడటం ప్రారంభించాడు.
ఆయన తొలిసారిగా 1981 లో భాగ్యవంత చిత్రంలో రెండు పాటలు పాడాడు.ఆయన సినిమా హీరో అయ్యాక కూడా సంగీతాన్ని విడిచిపెట్టలేదు. ఆయన ఇతర హీరోల సినిమాల్లో కూడా పాటలు పాడాడు. నటుడుగానే కాకుండా సింగర్ గా కూడా పలు అవార్డ్స్ లను సొంతం చేసుకున్నాడు పునీత్ రాజ్. పునీత్ రాజ్ హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలకు వ్యవహరించాడు. తొలిసారి 2019 లో కవలుదారి సినిమాకి నిర్మాతగా వ్యవహరించి మంచి గుర్తింపును సాధించాడు. అనంతరం పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి సక్సెస్ అయ్యాడు. పునీత్ బిగ్ స్క్రీన్ మీద బిజీ బిజీగా ఉంటూనే స్మాల్ స్క్రీన్ లో కూడా కనిపించాడు.
పలు షోలకు హోస్ట్ గా వ్యవహరించాడు, కన్నడంలో ప్రసారమైన కన్నడాడా కొట్యదిపతి తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు రెండు సంవత్సరాలు హోస్ట్ గా వ్యవహరించి విజయవంతంగా నడిపించాడు.అలాగే యూపీ స్టారర్స్కి కూడా జడ్జ్ గా వ్యవహరించాడు. సినిమాలు, టీవీ షో లే కాదు పలు సామాజిక కార్యక్రమాల్లో తన దాతృత్వాన్ని చాటుకున్నాడు.తన తల్లి పార్వతమ్మతో కలిసి అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. పునీత్ పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా కూడా వ్యవహరించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు.
1999 డిసెంబర్ 1 న పునీత్ అశ్విని రేవంత్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, వీళ్లకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.పునీత్ 45 ప్రీ స్కూల్స్, 26 అనాథాశ్రమాలు, 16 వృద్ధాశ్రమాలు,19 గోశాలలు, 1800 మంది విద్యార్థులకు చదువు చదివించి ఎందరినో ఆదుకున్నాడు. గుండె నొప్పితో 2021 లో పునీత్ అకస్మాత్తుగా మరణించాడు. చివరికి మరణం అనంతరం కళ్లను కూడా దానం చేసి సేవాగుణంతో చెరగని ముద్ర వేసుకున్నాడు.