Tollywood : తండ్రిగా ప్రమోషన్ పొందనున్న స్టార్ హీరో దంపతులు…

Tollywood  : తెలుగు సినీ ఇండస్ట్రీ మోస్ట్ బ్యాచిలర్ హీరోలలో ఒకరైన శర్వానంద్ ఈ ఏడాది పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు. అయితే రక్షిత రెడ్డి అనే అమ్మాయితో జూన్ 3న జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ పెళ్లి వేడుకలకు తెలుగు సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీస్ సైతం వచ్చి సందడి చేశారు. అయితే నిశ్చితార్థం అనంతరం ఆరు నెలల తర్వాత పెళ్లి చేసుకున్నారు ఈ జంట. అయితే ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

star-hero-couple-to-get-promotion-as-father
త్వరలోనే శర్వానంద్ మరియు రక్షిత రెడ్డి తల్లిదండ్రులు కాబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇలా వస్తున్న వార్తలు ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం అమెరికాలో ఉన్న రక్షిత రెడ్డి గర్భిణీ అని మెడికల్ చెకప్స్ తో పాటు డెలివరీ కూడా అక్కడే జరగబోతుంది అంటూ వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భార్యకు తోడుగా ఉండేందుకు శర్వానంద్ కూడా అమెరికా వెళ్లినట్లు సమాచారం. కొంతకాలం పాటు అక్కడే ఈ దంపతులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంత నిజమో తెలియాలంటే ఈ విషయంపై శర్వానంద్ స్పందిస్తే క్లారిటీ వస్తుంది.

Advertisement

star-hero-couple-to-get-promotion-as-father

ఇదిలా ఉండగా శర్వానంద్ చివరగా ఒకే ఒక జీవితం అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ప్రస్తుతం శర్వానంద్ తన 35వ సినిమా కోసం సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించబోతున్నట్లు దీనిలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం.

Advertisement