Tulasi Plant : తులసి మొక్కకు నీరు పోసేటప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తే అఖండ ఐశ్వర్యం మీ సొంతం…

Tulasi Plant : హిందూ సాంప్రదాయం ప్రకారం తులసి మొక్కకు పూజ చేయడం శుభ సూచకం. ఈ క్రమంలోనే హిందువులు ప్రతి రోజు బ్రహ్మ ముహూర్తాన లేచి సూర్యోదయం కాకముందే తులసి మొక్కకు పూజలు చేస్తూ ఉంటారు. ఇలా సూర్యోదయం ముందే తులసి పూజ చేయడం వలన ఇంట్లో సిరిసంపదలు తులతూగుతాయని నమ్మకం. అలాగే ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ఆ ఇంటి దరిచేరదని విశ్వసిస్తారు. అంతేకాక హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కను సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి దేవితో సమానంగా చూస్తారు. ఈ క్రమంలోనే ప్రతిరోజు తులసి కోటకు పూజ చేసి దీపం వెలిగిస్తే కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో లక్ష్మీదేవి కటాక్షంతో వర్ధిల్లుతారని నమ్ముతారు.

Advertisement

if-you-chant-this-mantra-while-watering-the-tulsi-plant-you-will-have-immense-wealth

Advertisement

అయితే ఇంట్లో తులసి మొక్కను లేదా కోటను ఏర్పాటు చేసుకోవాలంటే కాస్త ఎత్తుగా ఉన్న ప్రదేశం లోనే ఏర్పాటు చేయాలి. అలాగే సాయంత్రం వేళ తులసి మొక్క వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఉదయం సాయంత్రం తప్పనిసరిగా తులసి మొక్కకు పూజ చేసి దీపం వెలిగించాలి. దీపం వెలిగించిన సందర్భంలో దీపాన్ని మొక్కకు కాస్త దూరంగా ఉంచాలి లేకుంటే దీపం వేడికి ఆకులు మాడిపోతాయి. అలాగే అపవిత్రంగా ఉన్న సమయంలో తులసి మొక్కకు అసలు పూజలు చేయకూడదు. అదేవిధంగా ప్రతిరోజు తులసి మొక్కకు నీరు పోస్తూ ఉండాలి. అయితే ఈ నీరు పోసే సమయంలో మంత్రం జపించడం వలన మంచి జరుగుతుందని నమ్మకం.

if-you-chant-this-mantra-while-watering-the-tulsi-plant-you-will-have-immense-wealth

మంత్రాన్ని ఉచ్చరించకుండా తులసి మొక్కకు నీరు పోసిన ఎలాంటి ప్రయోజనం ఉండదు. మరి ఆ మంత్రం ఏమిటో దానిని ఎలా చదవాలి ఇప్పుడు నేర్చుకుందాం. ” మహాప్రసాద్ జనని సర్వ సౌభాగ్య వర్ధిని….హర నిత్య తులసి నమస్తుతే… ” ఈ మంత్రాన్ని తులసి మొక్కకు నీరు పోసే సమయంలో జపించడం వలన మంచి జరుగుతుందని నమ్మకం. అలాగే తులసి మొక్కను సాయంత్రం వేళలో అసలు ముట్టుకోకూడదు. సాయంత్రం వేళ తులసి ఆకులను కూడా కొయరాదు. ఇలా సాయంత్రం పూట ఆకులను తెంపినట్లైతే ఇంట్లో అశుభం కలుగుతుంది.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. యువతరం దీనిని ధ్రువీకరించలేదు.

Advertisement