Prabhas : ప్రభాస్ కి సర్జరీ….షూటింగ్స్ క్యాన్సిల్…ఆందోళనలో అభిమానులు…

Prabhas : ప్రస్తుతం వేరే స్టార్ హీరోస్ ఎవరికి సాధ్యం కాని విధంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల ఆదిపురుష్ తో అలరించిన ప్రభాస్ ఏడాది చివర్లో సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అలాగే కల్కి 2898AD వంటి మారుతి ప్రాజెక్ట్స్ షూటింగ్ దశలో ఉన్నాయి. ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ప్రభాస్ సడన్ గా బ్రేక్ తీసుకోబోతున్నారట .అది కూడా సుమారు నాలుగు నెలల పాటు అని తెలుస్తోంది. అయితే తన మోకాలి సర్జరీ కోసం ప్రభాస్ విదేశాలకు వెళ్తున్నట్లు సమాచారం.

Advertisement

surgery-for-prabhas-shootings-cancelled-fans-are-worried

Advertisement

ఇక ఈ సర్జరీ అనంతరం కనీసం ప్రభాస్ రెండు నెలల విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందట. ఈ నేపథ్యంలో ఆయన పూర్తిగా కోలుకొని షూటింగ్స్ లో పాల్గొనాలంటే కనీసం మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.ఇక అదే జరిగితే ప్రభాస్ సినిమాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. సలార్ వన్ షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసిన ప్రభాస్ డబ్బింగ్ చెప్పాల్సి ఉందట. ఇక ఈ సినిమాను నవంబర్ లేదా డిసెంబర్ లో విడుదల చేసేందుకు సినీ బృందం కసరత్తులు చేస్తుంది.

surgery-for-prabhas-shootings-cancelled-fans-are-worried

కానీ ప్రభాస్ సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటే డబ్బింగ్ చెప్పడం వరకు అంటే ఓకే కానీ, సినిమా ప్రమోషన్స్ కి రావడం కష్టమే అని అర్థమవుతుంది. ఇక ప్రాజెక్టు కే ను మొదట వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు కానీ ఇప్పటికే చాలా ఆలస్యం అవుతుంది. ఇక ఇప్పుడు ప్రభాస్ విశ్రాంతి తీసుకుంటే ఆ సినిమా మరింత ఆలస్యం అవుతుంది. ఇదే తరహాలో ఇతర ప్రాజెక్టు కూడా ఆలస్యం అవుతాయి. మొత్తానికి వరుస సినిమాలతో దూసుకెళ్తున్న ప్రభాస్ కు ఈ సర్జరీ బ్రేక్ వేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

Advertisement