Anushaka Shetty : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడుగా ఎంతో గుర్తింపు సంపాదించుకుని ఎన్నో అద్భుతమైన పాత్రలో నటించి అభిమానులను సొంతం చేసుకున్నటువంటి వారిలో దివంగతుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు ఒకడు. ఈయన సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలను నిర్మించారు. అయితే కృష్ణంరాజు వయసు పైబడడంతో గత ఏడాది సెప్టెంబర్ 11న అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో మరణించిన సంగతి తెలిసిందే . అయితే కృష్ణంరాజు మరణించి అప్పుడే ఏడాది పూర్తయింది.
ఈ క్రమంలో ఈయన మొదటి వర్ధంతి సందర్భంగా మరోసారి సినీ సెలబ్రిటీలు ఆయనను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా నటి అనుష్క శెట్టి కృష్ణంరాజును గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే నటి అనుష్కకు కృష్ణంరాజు ఫ్యామిలీ మరియు ప్రభాస్ తో మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. కృష్ణంరాజు గారు మరణించిన సమయంలో కూడా అనుష్క ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయన మొదటి వర్ధంతి సందర్భంగా అనుష్క సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆయనను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.
కృష్ణంరాజు గారు ఎంతో మంచి మనసున్న వ్యక్తి. గొప్ప నటుడిగా గొప్ప మనిషిగా ఆయన ప్రేమతో మిగిల్చిన జ్ఞాపకాలను నేనెప్పటికీ మర్చిపోలేను అంటూ ఈ సందర్భంగా అనుష్క చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది. ఇక ఈ పోస్టు చూసినటువంటి ప్రభాస్ అభిమానులు మరియు అనుష్క అభిమానులు ఈ పోస్ట్ పై స్పందిస్తూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. అంతేకాక కృష్ణంరాజు గారు అంటే అనుష్కకు ఎంతో ప్రేమ గౌరవమని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Remembering Krishamraju garu fondly on his first anniversary, with all the loving memories he left behind as big hearted human being and a great actor … ???????????? pic.twitter.com/ZGchVW8aSE
— Anushka Shetty (@MsAnushkaShetty) September 11, 2023