Tamil Nadu : పులులపై పగ పట్టిన రైతు…..తన ఆవును చంపిందని ఏకంగా పులినే…..!

Tamil Nadu  : రైతులకు మరియు పశువులకు మధ్య విడదీయరాని బంధం ఉంటుంది. రైతులు వారి పిల్లల కంటే కూడా ఎక్కువగా పశువుల పైన ప్రేమను పెంచుకుంటారు. పశువుల ప్రవర్తనలో తేడాను బట్టి వాటికి అర్థం చేసుకోగలిగే గుణం రైతులకు ఉంటుంది. ఇక ఆ సమయంలో వాటికోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే రైతు తాను పెంచుకున్న రెండు ఆవులను పులులు చంపి తినేసాయట. దీంతో ఆగ్రహించిన రైతు ఏకంగా పులిని మట్టు పెట్టేందుకు ప్రయత్నించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే….

tamil-nadu-farmer-arrested-for-killing-tigers-with-poison-to-avenge-the-death-of-his-cows

తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాకు చెందిన శేఖర్ అనే రైతుకు కాస్త పొలం మరియు వంశపారపర్యంగా వస్తున్న పశువులు ఉన్నాయి. ఆవు పాలను అమ్ముకుంటూ అతను జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే స్థానికంగా ఉన్న అడవి ప్రాంతంలోనే ఆవులను మేతకు తీసుకెళ్తాడు.అలాగే ఒక రోజు మేతకు తీసుకెళ్లిన ఆవులలో ఒక ఆవు మాత్రం ఇంటికి రాలేదు. ఆందోళనకు గురైన శేఖర్ ఆవు కోసం అడవి మొత్తం గాలించాడు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇక చేసేదేమీ లేక ఆరోజు రాత్రి ఇంటికి వచ్చి మరుసటి రోజు ఉదయాన్నేే ఆవు కోసం అడవి ప్రాంతానికి వెళ్లగా గుండె తరుక్కుపోయే దృశ్యం కనిపించింది. తాను ఎంతో ప్రేమగా సాకుతున్న మూగ జీవి విగత జీవిగా పడి ఉండడం చూసి శోకసంద్రం లో మునిగిపోయాడు.

tamil-nadu-farmer-arrested-for-killing-tigers-with-poison-to-avenge-the-death-of-his-cows

అంతేకాక ఆవు సగభాగమే ఉండడంతో ఇది కచ్చితంగా పులుల పనే అని భావించిన శేఖర్ కసితో రగిలిపోయాడు. ఇక వెంటనే పులులను చంపాలని నిర్ణయం తీసుకున్న శేఖర్ మాస్టర్ ప్లాన్ వేశాడు.ఫులులను చంపడం అంటే అంత తేలికైన విషయం కాదు కాబట్టి చనిపోయిన ఆవు కళేబరం పై పురుగుల మందు చల్లాడు. ఇక అప్పటికే ఆవును సగం తిని వెళ్లిపోయిన పులులు మరుసటి రోజు అక్కడికే వచ్చి మిగతా ఆహారాన్ని ఆరగించాయి. అయితే దానిపై శేఖర్ పురుగుమందు చల్లడంతో ఆ కళేబరాన్ని తిన్న పులులు చనిపోయాయి. ఇక వాటి కళేబరాలు అడవి ప్రాంతంలో ఉన్న వాగులో కనిపించాయి. అడవి శాఖ అధికారులు పరిశీలనలో ఈ విషయం ఆలస్యంగా బయటికి వచ్చింది.

tamil-nadu-farmer-arrested-for-killing-tigers-with-poison-to-avenge-the-death-of-his-cows

పులుల మృతదేహాలకు పోస్టుమార్టం జరిపించి అనంతరం వాటిని ఖననం చేశారు. ఇక పోస్టుమార్టం రిపోర్ట్ లో పులులు పురుగులు మందు కలిపిన మాంసం తినడం వలన చనిపోయినట్లుగా నిర్ధారణ అయింది. దీంతో విచారణ మొదలుపెట్టిన అటవీశాఖ అధికారులు చివరికి శేఖర్ ను ప్రశ్నించగా తన ఆవులను పులులు చంపి తిన్నాయని అందుకే వాటిపై పగ తీర్చుకున్నానని గర్వంగా చెప్పాడు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెంచుకున్న ఆవులను చంపినందుకు ఏకంగా పులులను మట్టు పెట్టిన రైతును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

tamil-nadu-farmer-arrested-for-killing-tigers-with-poison-to-avenge-the-death-of-his-cows