Post Office Scheme : ప్రతి ఒక్కరు సంపాదించిన డబ్బును ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు నైనా ఎదుర్కోగలుగుతారు. మనం కష్టపడి సంపాదించిన డబ్బులు ఇప్పటినుంచి ఎంతోకొంత పొదుపు చేస్తే పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు ఉపయోగపడతాయి. అయితే చాలామందికి డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అర్థం కాక సతమతమవుతుంటారు. అలాంటి వారికి ఈ పోస్టాఫీస్ పథకం బాగా ఉపయోగపడుతుంది. వీటిల్లో డబ్బు పొదుపు చేస్తే ఎటువంటి రిస్క్ ఉండదు. అంతేకాకుండా మంచి రాబడిని పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్లలో డబ్బులు దాచుకోవడం వలన దీర్ఘకాలంలో భారీ మొత్తాన్ని సొంతం చేసుకోవచ్చు.
ప్రస్తుతం పోస్టాఫీస్ లేదా బ్యాంకుల్లో సుకన్య సమృద్ధి యోజన అనే ఒక పథకం అందుబాటులో ఉంది. ఇందులో డబ్బులు పొదుపు చేస్తే పలు రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. మంచి రాబడి కూడా వస్తుంది. అయితే ఈ పథకం పదేళ్ల లోపు వయసు కలిగిన అమ్మాయిలకు మాత్రమే వర్తిస్తుంది. ఇంట్లో గరిష్టంగా ఇద్దరు అమ్మాయిల పేరుపై సుకన్య సమృద్ధి ఖాతాలు తెరవచ్చు. రూ.250 తో ఈ పథకంలో చేరవచ్చు. ప్రస్తుతం ఈ స్కీం పై 8% వడ్డీ రేటు లభిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేటు మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తూ ఉంటుంది. ఈ స్కీం లో చేరడం వలన పన్ను మినహాయింపు బెనిఫిట్ పొదవచ్చు. ఏడాదికి 1.5 లక్షల వరకు ట్యాక్స్ ఆదా చేసుకోవచ్చు. అలాగే రిస్క్ లేకుండా ఖచ్చితంగా రాబడి వస్తుంది.

ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లుగా ఉంది. అకౌంట్ తెరిచిన వారు కనీసం 15 ఏళ్ల పాటు డబ్బులు పొదుపు చేయాల్సి ఉంటుంది. ఏడాదిలో గరిష్టంగా 1.5 లక్షల వరకు డబ్బులు దాచుకోవచ్చు. మనకు నచ్చిన మొత్తాన్ని డిపాజిట్ చేసుకోవచ్చు. రోజుకి 50 పొదుపు చేయాలి అనుకుంటే నెలకు 1500 ఆదా అవుతాయి. ఈ డబ్బులను సుకన్య సమృద్ధి అకౌంట్ లో డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయానికి 8 లక్షలకు పైగా వస్తాయి. రోజుకు 100 పొదుపు చేయాలని అనుకుంటే నెలకు 3000 అవుతాయి. సుకన్య సమృద్ధి అకౌంట్లో పొదుపు చేస్తే మెచ్యూరిటీ సమయానికి 16 లక్షలకు పైగా వస్తాయి. ఈ పథకంలో పొదుపు చేస్తే పిల్లల భవిష్యత్తుకు బాగా ఉపయోగపడతుంది.