కాంగ్రెస్ కు భారీ షాక్ – బీఆర్ఎస్ లోకి ఉత్తమ్..?

పార్టీలోకి చేరికలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తోన్న కాంగ్రెస్ కు షాక్ ఇచ్చేందుకు కేసీఆర్ రెడీ అయ్యారు. కాంగ్రెస్ లోని కీలక నేతలను కారెక్కించేందుకు వ్యూహాలు సిద్దం చేశారు. టీపీసీసీ మాజీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు ఆయన సతీమణి ఉత్తమ్ పద్మావతిని బీఆర్ఎస్ లో చేర్చుకునేలా కేసీఆర్ మంత్రాంగం నడిపిస్తున్నారు.

Advertisement

ఉత్తమ్ తో ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు చర్చలు జరుపుతున్నారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో ఉత్తమ్ తో చర్చలు జరుపుతున్నారు. బీఆర్ఎస్ లో చేరడంపై సానుకూలంగా స్పందించిన ఉత్తమ్ కు హుజూర్ నగర్, కోదాడ స్థానాలను బీఆర్ఎస్ ఆఫర్ చేసిందన్న వార్తలు వెలువడుతున్నాయి. అయితే, బీఆర్ఎస్ లో చేరేముందు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు ఎంపీ పదవికి రాజీనామా చేసి పార్టీలో చేరుతానని ఉత్తమ్ అన్నట్లు చెబుతున్నారు.

Advertisement

బీఆర్ఎస్ లో చేరితే తనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఉత్తమ్ షరతు విధించారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై అధిష్టానంతో మాట్లాడి నిర్ణయం చెబుతామని వద్దిరాజు రవిచంద్ర అన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా బీఆర్ఎస్ లో చేరేందుకు ఉత్తమ్ రెడీ అయ్యారని…కాంగ్రెస్ లో చేరికల సమయంలోనే అందుకు కౌంటర్ గా ఉత్తమ్ ను పార్టీలో చేర్చుకునేలా బీఆర్ఎస్ వ్యూహం సిద్దం చేస్తోంది.

కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతున్న దృష్ట్యా కాంగ్రెస్ ను బలహీనపరచాలంటే ఉత్తమ్ ను ఈ సమయంలో కాంగ్రెస్ లో చేర్చుకోవాలని ప్రణాళిక సిద్దం చేసినట్లు చెబుతున్నారు.

Advertisement