Mega Family : మెగా ఇంట్లో వినాయక చవితి సంబరాలు……….పెళ్లికి ముందే కోడలితో తొలి పూజ చేపించిన నాగబాబు….

Mega Family : ఏడు సంవత్సరాలుగా ప్రేమలో మునిగితేలుతున్న టాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి మరి కొన్ని రోజుల్లో దంపతులు కాబోతున్నారు. దీనికి సంబంధించి మూడు నెలల క్రితమే పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఇక అప్పటినుండి ఇప్పటివరకు వీరిద్దరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. వీరిద్దరి ప్రేమ వ్యవహారాన్ని ఎంగేజ్మెంట్ తో ఒక్కసారిగా బయటపెట్టి టాలీవుడ్ టాక్ ఆఫ్ ది జంటగా మారారు. అప్పటినుండి ఏదో రకంగా వీరిద్దరూ వైరల్ అవుతూనే ఉన్నారు. అంతేకాక వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానులకు మంచి ట్రీట్ ఇస్తున్నారు.

Advertisement

vinayaka-chavithi-celebrations-at-megas-house-nagababu-performed-the-first-pooja-with-daughter-in-law-before-marriage

Advertisement

అయితే తాజాగా వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వినాయక చవితి సందర్భంగా నాగబాబు తన కొత్త కోడలితో పెళ్లికి ముందే విగ్నేశ్వరునికి పూజలు చేపించారు. కోడలితో తొలి పూజ చేపించి వినాయక చవితి వేడుకలు జరుపుకున్నారు. పూజ అనంతరం తీసిన ఫోటోలను వరుణ్ తేజ్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. అలాగే దానికి ” హ్యాపీ వినాయక చవితి” అని క్యాప్షన్ పెట్టి ” అందరికీ ఆరోగ్యం ,సౌభాగ్యం ఉండాలని కోరుకుంటున్నా ” అని రాసుకోచ్చారు. అలాగే నిహారికను మిస్ అవుతున్నట్లుగా పోస్ట్ పెట్టాడు. దీంతో ఈ ఫోటోలు కాస్త నెట్టింటా వైరల్ గా మారాయి.

vinayaka-chavithi-celebrations-at-megas-house-nagababu-performed-the-first-pooja-with-daughter-in-law-before-marriage

అలాగే పెళ్లికి ముందే వరుణ్ మరియు లావణ్య కలిసి గణేశుడికి తొలి పూజ చేయడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనందరికీ తెలిసిందే ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్న ముందుగా విజ్ఞేశ్వరుని ఆరాధిస్తారు. ఇది ఎప్పటినుండో వస్తున్న ఆనవాయితీ. ఈ నేపథ్యంలో కాబోయే దంపతులు ముందుగానే ఏకదంతునికి పూజలు చేయడం వారి సంసార జీవితం సంతోషంగా ఉంటుందని అభిమానులు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

Advertisement