Klin Kaara : క్లింకారా తో కలిసి మెగా ఫ్యామిలీ విఘ్నేశ్వరుడి పూజలు…స్పెషల్ ఎట్రాక్షన్ గా క్లింకారా..

Klin Kaara : దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగ సంబరాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా మెగా ఫ్యామిలీ భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకోవడం మనకు తెలిసిందే. అయితే ఈసారి కూడా మెగా ఫ్యామిలీ తన కుటుంబంతో కలిసి గణేష్ చతుర్ధిని జరుపుకున్నారు. కానీ ఈ సంవత్సరం చిరంజీవి మనవరాలు క్లింకారా తో కలిసి జరుపుకోవడం ప్రత్యేకంగా మారింది. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. పూర్తి వివరాల్లోకెళ్తే…

Advertisement

worship-of-mega-family-vigneshwar-along-with-c-klinkara-klinkara-as-a-special-attraction

Advertisement

ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో మట్టి వినాయకుని నెలకొల్పాడు. వినాయక చతుర్థి రోజున వినాయకుడికి పూజలు జరిపించి పండ్లు, పూలు సమర్పించాడు. ధూప దీప నైవేద్యాలతో గణనాధునికి తొలి పూజలు జరిపించాడు .ఇక ఈ పూజలో చిరంజీవి కూతుళ్లు వారి పిల్లలతో పాటు రామ్ చరణ్ , దంపతులు మరియు వారి కూతురు క్లింకారా హాజరయ్యారు. ఇక ఉపాసన ఒడిలో ఉన్న రామ్ చరణ్ కూతురు క్లింకారా ను చూస్తూ చిరంజీవి ఎంతగానో ఆనందంలో మునిగిపోయారు. ఈ ఏడాది పూజలో క్లింకారా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

worship-of-mega-family-vigneshwar-along-with-c-klinkara-klinkara-as-a-special-attraction

అయితే గత మూడు నెలలుగా తాత అమ్మమ్మ శోభన అనిల్ కామినేని ఇంట్లో ఉన్న క్లింకారా వినాయక చతుర్థి సందర్భంగా తొలి పూజ చేసేందుకు మెగాస్టార్ ఇంటికి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వేద పండితుల తో క్లింకారా కు స్వాగతం పలికారు మెగా ఫ్యామిలీ . ఇక మహాగణపతి పూజ అనంతరం చిరంజీవి, రామ్ చరణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు. కుటుంబ సభ్యులతో భక్తిశ్రద్ధలతో జరుపుకున్న ఈ పండుగ అభిమానులతో పంచుకునేందుకు సోషల్ మీడియా వేదిక వీటిని పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారయి.

worship-of-mega-family-vigneshwar-along-with-c-klinkara-klinkara-as-a-special-attraction

 

Advertisement