మహిళా రిజర్వేషన్ పై పోరుబాట మళ్ళీ ఎప్పుడు కవిత…?

మహిళా రిజర్వేషన్ ఉద్యమాన్ని చేపట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. రాజీ లేని పోరాటం చేస్తానని ప్రకటించిన కవిత… ఇప్పుడు ఆ అంశం గురించి ఎక్కడ ప్రస్తావించడం లేదు. అయితే, మహిళ రిజర్వేషన్ బిల్లు కోసం కవిత హస్తినలో ధర్నా చేస్తామని ప్రకటించినప్పుడే ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి.

Advertisement

తెలంగాణలో మహిళలకు పదిశాతం కూడా అవకాశాలు ఇవ్వని కేసీఆర్ ను నిలదీయడం మానేసి కవిత ఢిల్లీలో ఎలా ధర్నా చేస్తారనే విమర్శలు వచ్చాయి. హస్తినలో ఆందోళన చేపట్టడం మానేసి ప్రగతి భవన్ ముందు ధర్నా చేయాలని కవితకు హితవు పలికారు. మహిళా రిజర్వేషన్ కోసం ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించిన కవిత.. మిస్డ్ కాల్ కార్యక్రమంతోపాటు దేశంలో అన్ని విశ్వవిద్యాలయాలు, కాలేజ్ లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు.

Advertisement

దేశంలోని విద్యావేత్తలు, అధ్యాపకులు, బుద్దిజీవులకు పోస్ట్ కార్డులు పంపుతామని మే నుంచి ఉద్యమం ప్రారంభిస్తామన్నారు. పార్లమెంట్ బయట , లోపల ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఇందుకోసం వ్యూహంతో ముందుకు సాగుతామన్నారు. జాతీయ స్థాయి రాజకీయాల్లో తనదైన గుర్తింపు పొందేందుకే కవిత ఈ తరహ ఉద్యమానికి శ్రీకారం చుడుతుందని వాదనలు వినిపించాయి కానీ ఆ తరువాత మహిళ రిజర్వేషన్ అంశంపై ఆమె చప్పుడు చేయడం లేదు.

కవితకు ఆపద వస్తే తప్ప మహిళా రిజర్వేషన్ అంశంపై ఆమె మళ్ళీ స్పందించరని విమర్శలు వస్తున్నాయి.

Also Read : Reserve Bank : 500 నోట్లు రద్దు చేసిన రిజర్వ్ బ్యాంక్ .. దానికి కారణం ఇదే ..!!

Advertisement