అందరూ మనవరాళ్లే – చిరంజీవికి మనవడిని ఎత్తుకునే భాగ్యం లేదా..?

ఉపాసన – రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. జూలై 20వ తేదీ మంగళవారం తెల్లవారుజామున ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో సోషల్ మీడియాలో ఓ రకమైన చర్చ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవికి మనవడిని ఎత్తుకునే భాగ్యం లేదా అని చర్చించుకుంటున్నారు.

Advertisement

Advertisement

చిరంజీవికి ఇద్దరు కూతుళ్ళు సుస్మిత, శ్రీజలు. వీరికి కూడా ఇద్దరు అమ్మాయిలే పుట్టారు. ఇప్పుడు రామ్ చరణ్ కి కూడా పాపే పుట్టింది. ఎవరు పుట్టినా ఆనందించాల్సిన విషయమే. కానీ మనవడిని ఎత్తుకోవాలనుకున్న చిరంజీవికి అదొక కలగానే మిగిలిపోతుందా..? అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.మరోవైపు చిరంజీవి పెద్దకూతురు సుస్మిత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రామ్ చరణ్ కి అమ్మాయి పుట్టినా, అబ్బాయి పుట్టినా ఒకే. కానీ అబ్బాయి పుడితే ఇంకా ఆనందిస్తాం. ఎందుకంటే మా ఫ్యామిలీలో అందరూ అమ్మాయిలే ఉన్నారు అబ్బాయి ఒకడు లేదు. అందుకే మొదట అబ్బాయి పుట్టాలని కోరుకుంటున్నామని చెప్పింది.

ఇప్పుడు రామ్ చరణ్ కి అమ్మాయి పుట్టింది. దీంతో చిరంజీవికి మొత్తం ఐదుగురు మనవరాళ్ళు అయ్యారు. అయితే చిరంజీవి వారసత్వం వస్తే నెక్స్ట్ రామ్ చరణ్ కి అబ్బాయి పుట్టొచ్చు. చిరంజీవికి మొదట అమ్మాయి(సుస్మిత) పుట్టింది ఆ తరువాత అబ్బాయి (రామ్ చరణ్) అనంతరం శ్రీజ పుట్టింది కనుక.

Advertisement