మనం ప్రతి రోజు టీవీలలో, మొబైల్స్ లలో ఎవరికి డబ్బులు ఊరికే రావు అంటూ ఒక యాడ్ పదే పదే వస్తుండడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఆ డైలాగ్ వెనుక నిజాలు తెలిస్తే ఆశ్చర్యకపోక తప్పదు..
బంగారు నగల దుకాణాల వారు చేసే హడావిడి అంతా ఇంతా కాదు 11 నెలలు చిట్టి మీరు కట్టినట్లయితే ఒక నెల చిట్టి తామే ఉచితంగా ఇస్తామంటూ మనకి ఎన్నో మాయమాటలు చెబుతున్నారు. అయితే వాస్తవానికి ఈ విరాళం వెనక ఉన్న మతలబ్ ఏంటో.. ఈ స్కీములు నిజమేనా అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం.. వాస్తవానికి మన దేశంలో బంగారం అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే భారతీయులకు బంగారంతో ఉన్న అనుబంధం చెప్పలేనిది.
భూమి తర్వాత అధికంగా ప్రజలు ఇష్టపడేది బంగారాన్నే. ఇప్పటికి కూడా భారతదేశంలో స్టాక్ మార్కెట్ లోని మ్యూచువల్ ఫండ్స్ లోని పెట్టుబడులు పెట్టే వారి కన్నా బంగారం భూమిపైనే అధికంగా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఇబ్బందుల్లో కూరుకుపోయినప్పుడు బంగారం మనల్ని రక్షిస్తుందని బంగారం లక్ష్మీదేవితో సమానమని చెప్తూ ఉంటారు. కావున కష్టపడి సంపాదించుకున్న డబ్బులు కొంత భాగం బంగారంపై పెట్టుబడి పెట్టడానికి అసలు భయపడరు. ఒక నెల చిట్టి ఆభరణ దుకాణాలు వారు కడతాము అని అంటున్న మాట వెనుక దాగివున్న మోసం ఇదే… అయితే ఆభరణాల దుకాణాలలో మీరు నెల చీట్ స్కీం కింద డబ్బులు చెల్లించడం వలన నష్టమే అని చెప్పవచ్చు.
దీనిలో ఒక నెల ఆభరణాల దుకాణాల వారికి చెల్లిస్తున్నామని అంటున్నారు. అయితే దీనిలో మోసం ఉంది. మీరు ధనం 11 నెలలు కట్టిన తర్వాత మీరు నగలు తీసుకునే సమయానికి ఆనాటికి బంగారం ధరకు ఆభరణాల కొనుగోలు కట్టవలసి ఉంటుంది. అలాగే తయారీ, వేస్టేజ్ ఇలా ఎన్నో చార్జీల పేరిట నగలపై అదనపు చార్జీలను వేస్తూ ఉంటారు. దీని ప్రకారం చూస్తే ఆభరణాల దుకాణాల వారు ఇచ్చినటువంటి 12వ నెల చిట్టి కూడా ఈ లాభంలో కొట్టుకుపోతుంది. అనే విషయాలను మీరు తెలుసుకోవాలి. మరి ఆభరణాలు తీసుకోవాలంటే ఏం చేయాలి…ఇప్పుడు బ్యాంకులలో రికరింగ్ డిపాజిట్లను చక్కటి వడ్డీ ఇస్తున్నారు.

అయితే మీరు ఆభరణాలను కొనుగోలు చేయాలి అనుకుంటే ప్రతి నెల 5000 చొప్పున రికరింగ్ డిపాజిట్లు పొదుపు చేసుకుంటే మీకు దాదాపు 7 నుంచి 9% వరకు ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. దాని వలన మీ ధనం సురక్షితంగా బ్యాంకులో ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత రికరింగ్ డిపాజిట్ నుంచి వచ్చిన ధనంతో మీరు ఆభరణాలను కొనుక్కోవచ్చు. ఇటువంటి డబ్బులు ఊరికే రావు అని స్కీముల్లో చేరి మోసపోకండి. చట్టం ఇలా చెప్తుంది; మధ్యతరగతి జనాలు ఆభరణాలపై ఉన్న మోజును ఆసరాగా తీసుకొని నగల షాపుల వాళ్లు ఇలా స్కీములను తీసుకొచ్చి జనాల్ని ఎంతో మోసం చేస్తున్నారని ఇది పూర్తిగా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం అని చెప్తున్నారు.
ప్రజల వద్ద ఉన్న ధనం సేకరించిన డబ్బులు వారు అడ్వాన్స్గా పేమెంట్ గా చెబుతున్నప్పటికీ ఎటువంటి నియంత్రణ లేదని చెప్పవచ్చు. జనాలు లిమిటెడ్ కంపెనీ చట్టం 2013 ప్రకారం మాత్రమే ఆభరణాల దుకాణాల వారు ఈ అడ్వాన్స్ పేమెంట్ లను తీసుకోవడం జరుగుతుంది. అయితే ఆర్.బి.ఐ కానీ ఇంకా ఇటువంటి స్కీం ల గురించి పూర్తి లెవెల్ లో నిబంధనలు తీసుకోవాలని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ బంగారు స్కీములు ప్రజల లిమిటెడ్ కంపెనీలు చట్టం 2016లో మార్పుల తర్వాత కొద్దిగా నియంత్రణలోకి వస్తుంది. కాబట్టి ఇటువంటి మోసపూరితమైన స్కీం లకు ప్రజలు దూరంగా ఉండాలని చట్టం చెబుతోంది.