Balakrishna : Jr.NTR పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. ఐ డోంట్ కేర్ అంటూ…

Balakrishna : తెలుగు పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీకి ఎటువంటి గౌరవం ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీనియర్ ఎన్టీఆర్ తో మొదలైన ఆ ప్రస్థానం ఇప్పటికీ ఆయన వారసులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ లాగానే బాలకృష్ణ కూడా సినిమాలు చేస్తూ మరోవైపు రాజకీయాల పరంగా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే.

Advertisement

balakrishna-sensational-comments-on-jr-ntr-saying-i-dont-care

Advertisement

టిడిపి అధినేత చంద్రబాబును ఓ కేసులో ఇరికించి రిమాండ్ కు తరలించారు. దీనిపై ప్రజలు జగన్ పై ఫైర్ అవుతున్నారు. కేవలం ఏపీనే కాదు తెలంగాణలోని ప్రజలు కూడా చంద్రబాబు ను విడిపించాలని పెద్ద ఎత్తున గొడవలు చేశారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణలో ఎన్నికలు మొదలయ్యాయని తన తండ్రి పేరుని జపం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టుపై సినిమా వాళ్ళు స్పందించక పోవడాన్ని తను పట్టించుకోనని స్పష్టం చేశారు. ఏపీలో సైకో పరిపాలన నడుస్తుంది. ప్రజా సంక్షేమ వదిలి ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టే రాజకీయం అక్కడ జరుగుతుంది.

17వ సెక్షన్ పాటించకుండా చంద్రబాబును అరెస్టు చేశారు. ఈ విషయంలో కేంద్రం హస్తం ఉందో లేదో అవగాహన లేదు. అనవసరంగా ఎవరి పైన నిందలు వేయం. భాజపా అధ్యక్షురాలుగా మా అక్క పురందేశ్వరి ఉన్నారు. ఈ విషయంపై కేంద్రంతో మాట్లాడుతాం. ఇకపోతే చంద్రబాబు అరెస్టుపై సినిమా వాళ్ళు పట్టించుకోకపోవడం నాకు అనవసరం. ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్. ఇక రోజా లాంటి వాళ్లపై స్పందించకుండా ఉండటమే మంచిది. బురద మీద రాయి వేస్తే మన మీద పడుతుంది అని బాలకృష్ణ ఈ సందర్భంగా అన్నారు.

Advertisement