Trees Worship : ఈ చెట్టును పూజిస్తే ఇక జీవితంలో తిరుగు ఉండదు…

Trees Worship  : సనాతన ధర్మంలో ప్రకృతిని దైవంగా భావించి పూజిస్తారు. మొక్కలు, జంతువులను దేవతలుగా భావించి పూజిస్తారు.. చెట్లు ను దైవానికి ప్రతిరూపంగా భావించి హిందువులు పూజిస్తారు.చెట్లను ఆరాధించడం వలన జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. వ్యాధుల బారి నుంచి రక్షణ దొరుకుతుందని విశ్వాసం. కొన్ని రకాల చెట్లను మాత్రమే కాదు.. పువ్వులు, పండ్లు కూడా పూజనీయంగా భావించి పూజిస్తారు. జ్యోతిష్య శాస్త్ర ప్రయోజనాలు కూడా అందిస్తాయని విశ్వాసం. అయితే కోరిన కోరికలు తీర్చే చెట్లు మొక్కల గురించి పూజా విధానం గురించి మనం తెలుసుకుందాం…

Advertisement

ఉసిరి చెట్టుకి పూజ….

if-you-worship-this-tree-there-will-be-no-return-in-life

Advertisement

సనాతన ధర్మంలో ఉసిరి చెట్టును చాలా పవిత్రంగా భావిస్తారు. లక్ష్మి దేవి కన్నీళ్ల నుంచి ఉసిరి చెట్టు ఉద్భవించిందని విశ్వాసం. భగవంతుని ఆశీస్సులు ఉంటాయని నమ్మకం. సంతోషకరమైన జీవితాన్ని గపుతారు.

అరటి చెట్టుకి పూజ…

if-you-worship-this-tree-there-will-be-no-return-in-life

అరటి చెట్టుపై విష్ణువు కొలువై ఉంటాడని విశ్వాసం. విష్ణువు అనుగ్రహం కోసం గురువారం నారాయణని పూజించిన తర్వాత అరటి చెట్టును పూజిస్తారు. ఇలా చేయడం వల్ల విష్ణువు సంతోషించి సుఖ సంతోషాలను ప్రసాదిస్తాడని నమ్మకం.

మామిడి చెట్టుకి పూజ:

if-you-worship-this-tree-there-will-be-no-return-in-life

మామిడి చెట్టు పూజకు ప్రాధాన్యత పురాణ గ్రంథాల్లో మామిడి చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉందని పేర్కొన్నారు. ఈ చెట్టు ఆకులు పండ్లు అన్ని పూజకు ఉపయోగపడతాయి. అంతేకాదు హనుమంతుడికి మామిడి పండ్లు అంటే ఇష్టమని హిందువుల విశ్వాసం. మామిడి చెట్టుకి పూజ చేయడం వలన బాధలు కష్టాలు తొలగిపోయి సుఖసంతోషాలు కలుగుతాయి.

తులసికి పూజ….

if-you-worship-this-tree-there-will-be-no-return-in-life

తులసికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది. తులసికి పూజ చేసిన వారు ఎల్లప్పుడూ ఆనందం శ్రేయస్సు ఉంటుంది తులసి విష్ణు ప్రియమైనధి అని కూడా అంటారు. శ్రీహరి అనుగ్రహంతో సంపదలతో నిండి ఉంటారు.తులసిని పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని విశ్వాసం.

రావి చెట్టుకి పూజ…

if-you-worship-this-tree-there-will-be-no-return-in-life

రావి చెట్టు త్రిమూర్తుల నివాసం. త్రిమూర్తులు రావిచెట్టు మూలాలలో నివసిస్తారని పూజించడం వల్ల సాధకుడు జీవితానికి సంబంధించిన అన్ని దుఃఖాలు తొలగిపోతాయి. అంతేకాదు ఎవరికైనా ఆర్థిక సమస్యలు పరిష్కారం కాకపోతే రావి చెట్టును పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని విశ్వాసం. అంతేకాదు ఆనందం అదృష్టం కూడా లభిస్తుంది…

గమనిక : ఈ కథనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే…యువతరం దీనిని ధ్రువీకరించలేదు.

Advertisement