హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈసారి ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటున్నారు. నాలుగు నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని డిసైడ్ అయ్యారు. అభ్యర్థుల వడపోత ప్రక్రియ పూర్తైంది. జూలై రెండో వారంలోనే బీఆర్ఎస్ తరుఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం వెనక కేసీఆర్ వ్యూహం దాగి ఉందని పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి.
టికెట్ దక్కని అసంతృప్తితో ఆశావాహులు ఎన్నికల ముంగిట పార్టీని వీడితే అది బీఆర్ఎస్ కు మైనస్ అవుతుంది. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులను రావోద్దనేది కేసీఆర్ లెక్క. ఏ తలనొప్పులు ఉండొద్దని నాలుగు నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని డిసైడ్ అయ్యారు కేసీఆర్. టికెట్ ఆశావాహులు అధికంగా ఉన్న చోట , ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను రెండో విడతలో ప్రకటించే యోచనలో కేసీఆర్ ఉన్నారు. మొదటి విడతలోనైతే 80మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు.
ఇప్పటికే జిల్లాల పర్యటనలో భాగంగా కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీలో ఉంటారో క్లారిటీ ఇస్తున్నారు. కేటీఆర్ అయితే ఏకంగా అభ్యర్థుల పేర్లను చెప్పి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. ఇప్పటివరకు కేసీఆర్, కేటీఆర్ ల ప్రకటనలు బట్టి దాదాపు 20 స్థానాల్లో ఎమ్మెల్యేలకు స్పష్టత వచ్చింది. మరికొంతమంది మందికి మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో వారికీ కష్టమేనని అంటున్నారు.
Also Read : కాంగ్రెస్ లో టీజెఎస్ విలీనం – కోదండరాంకు కీలక పదవి ఆఫర్..?