
మనల్ని వేధించే అనారోగ్య సమస్యల్లో చర్మ సమస్య కూడా ఒకటి. చాలామంది తామర, గజ్జి, దురదలు ఇటువంటి చర్మ సమస్యలతో బాధపడే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ప్రారంభమవ్వడానికి చాలా చిన్నగానే ప్రారంభమవుతాయి. మొదట కొంచెం దురదగా అనిపిస్తుంది. అది గోకితే చిన్న పుండులా తయారవుతుంది. ఆ పుండు కాస్త శరీరం పై వ్యాపిస్తుంటుంది. మనం చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేస్తే అది మనకు తెలియకుండానే తామరగాను, గజ్జిగాను కూడా మారిపోతూ ఉంటుంది. ఇక అది పెట్టే అవస్థలు అన్ని ఇన్ని కావు. మరి ఇటువంటి చర్మ సమస్యలకు మన ఇంట్లో దొరికే ఇంగ్రిడియంట్స్ తోనే సులభంగా పోగొట్టుకొని అద్భుతమైన హోమ్ రెమిడి ఈ మీకు చెప్పబోతున్నాను. తేమ అధికమవడం వల్ల కూడా కొన్ని రకాల చర్మ వ్యాధులు వస్తాయి.
చర్మం పొడిగా మారిపోతే అంటే డిహైడ్రేట్ అయిపోతే శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల చర్మం పొడి వారి పోయి పగుళ్ళలా వస్తుంది. ఆ పగుళ్లు కాస్త దురదలు, దురదల నుంచి చిన్న చిన్న పుండ్లుగా వచ్చి ఆ తర్వాత గజ్జి రూపంలో ఆ చర్మం చుట్టుపక్కలంతా కూడా వ్యాపిస్తుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకునే ఈ రెమెడీ కనుక మీరు ట్రై చేస్తే సోరియాసిస్ కూడా ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఈ రెమిడితో ఇప్పుడు ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా లేతగా ఉండే వేపాకులు కొన్ని కొమ్మలు తెచ్చుకోండి. అంటే మీ చేతితో ఒక గుప్పెడు లేత వేపాకులు తెచ్చుకోవాలి. వాటిని ముందుగా శుభ్రంగా కడిగి మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఒక కొమ్మ అలోవెరా తెచ్చుకోండి. ఒకవేళ మీకు అందుబాటులో రెడీమేడ్ గా ఫ్రెష్ అలోవెరా దొరికితే ఒక కొమ్మ సరిపోతుంది.
ఇప్పుడు మనం తీసుకుబొయే మరొక ఇంగ్రిడియంట్ పచ్చ కర్పూరం దీన్ని కూడా మెత్తని పౌడర్లా చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక బౌల్లో మనం మెత్తగా పేస్టులా చేసుకున్న వేపాకు పేస్ట్ ని వేయండి ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు మనం దంచి ఉంచుకున్న పచ్చ కర్పూరం వేయండి. వేసుకుంటూ కలుపుకోండి. ఈ మూడింటిని ఒకసార బాగా కలపాలి. తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కలపండి. ఇప్పుడు మీకు ఎక్కడైతే చర్మ సంబందిత సమస్యలున్నాయో ముందుగా ఆ ప్రాంతాన్ని శుభ్రంగా వాష్ చేసేయండి.
తడి లేకుండా పొడి బట్టతో శుభ్రంగా ఒత్తుకుని ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ వేపాకు మిశ్రమాన్ని ఎక్కడైతే స్కిన్ ఎలర్జీ ఉందో అక్కడ అప్లై చేయండి. ఇలా మీరు ప్రతిరోజు గనుక చేయగలిగితే చాలా తొందరగా మీ చర్మ సమస్యలు నయమైపోతాయి. ఒకవేళ మీకు ప్రతిరోజు కుదరకపోతే రాత్రిపూట పడుకునే ముందు వేపాకు నూనెతో మీ స్కిన్ పైన రాయండి. అంటే ఎక్కడ ఎలర్జీ ఉందో అక్కడ వేపాకు నూనె రాయండి. ఇలా చేయడం వలన మీ చర్మ సంబంధిత సమస్యలు అన్ని తగ్గిపోతాయి.