CM YS Jagan : లండన్ నుండి రాగానే చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన జగన్….

CM YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ విదేశీ పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్ తిరిగి వచ్చారు. మంగళవారం ఉదయం గన్నవరం ఎయిర్ పోర్ట్ కు సీఎం చేరుకున్నారు. అక్కడినుండి రోడ్డు మార్గంలో తాడేపల్లి నివాసానికి వెళ్లారు. ముఖ్యమంత్రికి మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు స్వాగతం పలికారు. సీఎం జగన్ ఇవాళ రాష్ట్రంలోని శాంతి భద్రతలు తాజా పరిణామాలపై సమీక్ష , నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. అలాగే చంద్రబాబు అరెస్ట్ పై కూడా జగన్ స్పందించబోతున్నారు. ఇక తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు జగన్ లండన్ నుండి తెలుసుకుంటూనే ఉన్నారు. ఇక జగన్ రాకతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయి.

Advertisement

చంద్రబాబు అరెస్టుపై జగన్ ఏం మాట్లాడబోతున్నారా అని ఏపీ ప్రజలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే లండన్ నుంచి రాగానే జగన్ ఢిల్లీ పర్యటన కన్ఫామ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే బుధవారం సాయంత్రం జగన్ ఢిల్లీలో పర్యటించనున్నారు. అయితే వారం రోజులు పాటు లండన్ పర్యటన చేసిన జగన్ వచ్చి రాగానే సడన్ గా ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని టిడిపి శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు. జగన్ చంద్రబాబు కేసు పై వెళ్తున్నారా లేక ఏదైనా పని ఉండి వెళ్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో లండన్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన జగన్ న్యూస్ ట్రెండ్ అవుతుంది.ఈలోపే మళ్ళీ ఢిల్లీ పర్యటన న్యూస్ బయటకు రావడంతో అది కాస్త వైరల్ గా మారింది.

Advertisement

ఇక చంద్రబాబు అరెస్టుపై జగన్ వ్యూహాత్మకంగా స్పందించబోతున్నారని అర్థమవుతుంది. ఎందుకంటే ఇది రాజకీయపరంగా చేసింది కాదు చంద్రబాబు తన అవినీతి పనుల వలన అరెస్టు అయ్యారని జగన్ గట్టిగా చెప్పబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఎలక్షన్స్ నేపథ్యంలో ఇవి మరింత రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తుంది.

Advertisement