కర్ణాటకలో మే నెలాలో జరగనున్న అసంబ్లీ ఎన్నికల అన్ని సర్వేలు కాంగ్రస్ పార్టీ అధికారం దక్కించుకుంటుంది అని తేల్చాయి. బిజెపి రెండో స్టానంలో ఉంటుంది అని దాదాపు అన్ని జాతీయ సర్వేలు తేల్చాయి. కానీ జనం పెద్దగ నమ్మలేదు అనే చెప్పాలి. ముఖ్యంగా రాజకీయ పండితులు కూడా నమ్మలేదు. ఎందుకంటే ఈ సర్వేలు కొంతలో కొంత పక్షపాత వైఖరి చూపే అవకాశం ఉంది కాబట్టి.
కానీ సర్వేలు చెప్పడంలో ఆరితేలిన హైదరాబాద్ కి చెందిన శ్రీ ఆత్మ సాక్షి గ్రూప్ karnataka survy కర్నాటక సర్వే ఫలితాలను తాజాగా వెల్లడించింది. ఈ గ్రూప్ సర్వేలు ఇప్పటివరకు దాదాపు 99 శాతం నిజమయ్యాయి. కాబాట్టి ఈ ఫలితాలు అటు ప్రజల్లో, ఇటు రాజకీయ నాయకుల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి.
ఈ సర్వే ఫలితాల ప్రకారం karnataka elections కర్నాటకలో ఈసారి ఎన్నికల్లో congress కాంగ్రెస్ కి 110 నుంచి 118 సీట్లు వస్తాయని తేల్చేసింది. అంటే మ్యాజిక్ ఫిగర్ ని కాంగ్రెస్ సాధించి కచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పేసింది. ఇక బీజేపీకి వచ్చే సీట్లు 85 నుంచి 93 మధ్యనే అని సర్వే క్లారిటీ ఇచ్చేసింది.
karnataka polls ఈ ఫలితాలు కాంగ్రెస్ ని కొత్త ఉరకలు వేయిస్తోంది. ఆ పార్టీ అక్కడ బలంగా ఎదిగిన మాట వాస్తవం. దీనికి తోడూ కర్ణాటక ప్రజలు మార్పును కోరుకుంటారు. ఇప్పుడున్న బిజెపి వలన ఎలాంటి కొత్త పనులు జరగలేదని రుజువయ్యింది. కావున మునుపటి కాంగ్రెస్ అధికరరంలోకి వస్తనే ఉద్యోగాలు వచ్చి, పరిశ్రమలు వస్తాయి అని భావిస్తున్నారు. దీనికి తోడూ బిజెపి ముఖ్య మంత్రులను తరచూ మార్చడం వలన, అక్కడ అంతర్గత కుమ్ములాటలు బిజెపిని చావు దెబ్బ కొట్టాయి. అధిష్టానం కూడా కర్ణాటక మీద పెద్దగా శ్రద్ధవహించాకపోవడం కూడా మరో కారణం. ఏది ఏమైనా ఈ ఎన్నికల ఫలితాలు మాత్రం బిజెపి కి చాలా గుణపాటాలు నేర్పేలా ఉన్నాయి.