సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ బీఆర్ఎస్ లో చేరనున్నారా..? ఇందుకు ముహూర్తం ఖరారు అయిందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
లక్ష్మినారాయణ చూపు BRS బీఆర్ఎస్ వైపు మల్లుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలి ఆయన చేస్తోన్న ట్వీట్లు బీఆర్ఎస్ గురించే ఎక్కువగా ఉంటున్నాయి. స్టీల్ ప్లాంట్ లో బీఆర్ఎస్ క్రెడిట్ కొట్టేయడానికి ప్రధాన కారణం జేడీ లక్ష్మినారాయణే. STEEL PLANT స్టీల్ ప్లాంట్ బిడ్ లో పాల్గొనాలని బీఆర్ఎస్ ను ఆయనే డిమాండ్ చేశారు. ఆ తరువాత బీఆర్ఎస్ బిడ్ వేస్తామని చెప్పగానే ఆ పార్టీని అభినందించారు. తాజాగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని కేంద్రం చెప్పగానే ఆ క్రెడిట్ ను బీఆర్ఎస్ కు ఇచ్చింది కూడా ఆయనే. దీంతో ఆయన బీఆర్ఎస్ లో చేరడం ఖాయమనే ప్రచారం బలంగా జరుగుతోంది.
ఇటీవలే తనకు వైసీపీ నుంచి ఆహ్వానం ఉందని చెప్పారు లక్ష్మినారాయణ. కానీ ఆయన ఆ పార్టీలో చేరేందుకు మనసొప్పడం లేదు. జగన్ ను జైలుకు పంపిన అధికారిగా పేరున్న లక్ష్మినారాయణ ఇప్పుడు ఆ పార్టీలో చేరితే ఆయన విశ్వసనీయతే ప్రమాదంలో పడుతుంది. TDP టీడీపీలో చేరితే జగన్ కేసులపై ప్రభావం పడుతుంది. టీడీపీ నేతల డైరక్షన్ మేరకే Jagan Mohan Reddy జగన్ ను జైలు పాలు చేశారని ఇప్పుడు అసలు కథ బయటకొచ్చిందని వైసీపీ విమర్శలు చేస్తోంది. జనసేన నుంచి ఆయనకు ఎలాంటి ఆహ్వానం లేదు. ఎందుకంటే గతంలో అకారణంగా బయటకు వచ్చిన ఉదంతం ఉండటంతో మళ్ళీ ఆహ్వానించాలని పవన్ అనుకోవడం లేదు. బీజేపీలో చేరాలనే ఆ పార్టీ నేతలు కోరుతున్నారు కానీ ఎందుకో ఆయన ఇంట్రెస్ట్ చూపడం లేదు.
ఈ నేపథ్యంలో ANDHRAPRADESH ఏపీలో బీఆర్ఎస్ విస్తరణపై దృష్టిసారించిన కేసీఆర్ కు JD LAXMINARYANA జేడీ లక్ష్మినారాయణ కనిపించారు. చర్చలు కూడా జరిగాయని స్వయంగా జేడీ లక్ష్మినారాయణ ప్రకటించారు. ఈ క్రమంలోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిచిపోయేందుకు కారణం బీఆర్ఎస్సే నని జేడీ పరోక్షంగా చెబుతున్నారు. ఆ ప్రచారానికి జేడీ లక్ష్మినారాయణ మద్దతునిస్తున్నారు. ఈ ఉదంతంతో VIZAG విశాఖనుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా లక్ష్మీనారాయణ పోటీలో ఉండటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. త్వరలోనే స్టీల్ ప్లాంట్ విజయోత్సవాలను నిర్వహించనున్న బీఆర్ఎస్ సభను ఏర్పాటు చేయనుంది. ఆ సభలోనే జేడీ లక్ష్మినారాయణ బీఆర్ఎస్ లో చేరే అవకాశం కనిపిస్తోంది.