YCP : త్వరలో పార్లమెంట్ లో శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. వచ్చే నెల డిసెంబర్ 7 నుంచి 29 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో శీతాకాల సమావేశాలు వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారనున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్రం పలు బిల్లులను ప్రవేశపెట్టనుంది. అందులో విద్యుత్ సవరణ బిల్లు కూడా ఉంది. పార్లమెంట్ లో విద్యుత్ సవరణ బిల్లును ఆమోదించుకోవడం కోసం బీజేపీకి తగ్గ బలమే ఉంది కానీ.. రాజ్యసభలో మాత్రం మిత్రపక్షాలతో కలిసి బిల్లును నెగ్గించుకోవచ్చు.

కానీ.. బిజూ జనతాదళ్ ఎప్పడు ఎన్డీఏకు ఎగనామం పెట్టేది తెలియదు. పలు అంశాల వల్ల ఆ పార్టీ మద్దతు ఇస్తోంది. ఒకవేళ మద్దతు ఇవ్వకపోతే.. రాజ్యసభలో ఆ బిల్లు నెగ్గడం కష్టం. అప్పుడు బీజేపీకి ఉన్న ఏకైక దారి వైసీపీ పార్టీ. వైసీపీకి ఎలాగూ పార్లమెంట్ లో 20కి పైగే ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలోనూ సభ్యులు ఉన్నారు. ఎలాగూ బీజేపీ ప్రభుత్వానికి వైసీపీ మద్దతు ఇస్తోంది. అయినా కూడా ఈసారి వైసీపీకి కొంచెం క్లిష్టమైన సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
YCP : విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న రైతులు
అయితే.. విద్యుత్ సవరణ బిల్లును దేశవ్యాప్తంగా రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లు వల్ల నష్టం కలుగుతోందంటున్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి.. ఉచితంగా కాకుండా వ్యవసాయ మోటార్లకు కూడా బిల్లు వచ్చేలా చేయడమే ఈ విద్యుత్ సవరణ బిల్లు ఉద్దేశం. అలా చేస్తే రైతుకు ఉచిత కరెంట్ ఇచ్చే పథకం నీరుగారిపోతుందని.. తమ రాష్ట్రాల్లో మాత్రం దానికి మేము ఒప్పుకోమని తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాలు తేల్చి చెప్పాయి. మరోవైపు ఏపీలోనూ ఉచిత విద్యుత్ అందిస్తున్నప్పటికీ.. వైసీపీ ప్రభుత్వం మాత్రం దీనిపై స్పందించలేదు. ఒకవేళ వైసీపీ ప్రభుత్వం ఈ బిల్లుకు మద్దతు ఇస్తే ఏపీలో రైతులు వైసీపీకి వ్యతిరేకంగా తయారు అవుతారు. దీనిపై ఎలా స్పందించాలో తెలియక తర్జన భర్జన పడుతోంది వైసీపీ. ఒకవేళ మద్దతు ఇవ్వకపోతే బీజేపీ ప్రభుత్వంతో తెగదెంపులు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే.. పార్లమెంట్ లో వైసీపీ వ్యూహం ఎలా ఉంటుందో చూద్దాం మరి.