Revanth Reddy : రేవంత్ రెడ్డి వల్లనేనా ఇదంతా.. కాంగ్రెస్ లో అతి పెద్ద వికెట్ డౌన్..!

Revanth Reddy : ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న యాక్టివ్ నేత అంటే ఒక్క రేవంత్ రెడ్డి అనే చెప్పుకోవచ్చు. ఆయన ఎప్పుడైతే తెలంగాణ పీసీసీకి చీఫ్ గా నియామకం అయ్యారో అప్పటి నుంచి తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. అంతవరకు బాగానే ఉంది కానీ.. నిన్న కాక మొన్న వచ్చి ఏకంగా పీసీసీ చీఫ్ అయ్యాడని రేవంత్ రెడ్డిపై చాలామంది సీనియర్లు గుర్రుగా ఉన్నారు. సీనియర్ నేతలు తట్టుకోలేకపోతున్నారు. దశాబ్దాలుగా పార్టీకి సేవలందిస్తూ వస్తున్న మాకు కాదని వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి ఎలా పీసీసీ చీఫ్ పదవి ఇస్తారంటూ సీనియర్ నేతలు భగ్గుమంటున్న విషయం తెలిసిందే.

marri shashidhar reddy to join in bjp soon
marri shashidhar reddy to join in bjp soon

ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి లాంటి నేతలు అయితే రేవంత్ కు పీసీసీ పగ్గాలు ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. ఇప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఆ కోపంతోనే బీజేపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. బీజేపీతో వాళ్లు టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. ఆ మధ్య వెంకట్ రెడ్డి బీజేపీలో చేరుతారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ దాని గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే.. ప్రస్తుతం మర్రి శశిధర్ రెడ్డి మాత్రం బీజేపీ వైపు చూస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

Revanth Reddy : కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన శశిధర్ రెడ్డి

ఇటీవల ఢిల్లీకి వెళ్లిన మర్రి శశిధర్ రెడ్డి.. కేంద్రం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. బీజేపీ చీఫ్ బండి సంజయ్, డీకే అరుణతో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రిని కలిశారు. కేంద్ర హోంమంత్రిని కలిశారు అంటే.. ఆయన బీజేపీలో చేరడం ఖాయం అయిపోయినట్టే. త్వరలోనే శశిధర్ రెడ్డి.. జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ శశిధర్ రెడ్డి బీజేపీలో చేరితే అది రేవంత్ రెడ్డికి దెబ్బ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీ అల్లకల్లోలం కావడానికి రేవంత్ రెడ్డి, మాణిక్యం ఠాగూర్ అంటూ శశిధర్ రెడ్డి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన పార్టీ మారితే.. మిగితా సీనియర్ నేతలు కూడా బీజేపీకి క్యూ కట్టే అవకాశం ఉంది. చూద్దాం మరి.. రేవంత్ రెడ్డి ఈ మ్యాటర్ ను ఎలా హ్యాండిల్ చేస్తారో?