పుల్వామా దాడి ఘటనకు మోడీనే బాధ్యుడా..?

పుల్వామా దాడి ఘటనపై జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన విషయాలను వెల్లడించారు. ఉగ్రవాదుల నుంచి జవాన్లకు ముప్పు ఉందని నిఘా వర్గాలు 11సార్లు హెచ్చరించినా కేంద్రం పట్టించుకోలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఉగ్రవాదుల నుంచి సైనికుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో జవాన్లను రోడ్డు మార్గంలో పంపడం సరైంది కాదని… వారిని ఎయిర్ క్రాఫ్ట్ లో పంపించాలని తాను సూచనలు చేసినా ప్రధాని నరేంద్ర మోడీ , అమిత్ షా లు పట్టించుకోలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పుల్వామా ఎటాక్ జరిగిన తరువాత తాను చేసిన సూచనలు , కేంద్రం పెడచెవిన పెట్టిన అంశాలను ఎక్కడ లీక్ చేయవద్దని ప్రధాని చెప్పారని సత్యపాల్ మాలిక్ వెల్లడించారు. పుల్వామా దాడి పూర్తిగా కేంద్రం నిర్లక్ష్యమేనని అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ నుంచి పేలుడు పదార్థాలతో వచ్చిన ట్రక్కు ఇండియాలో కీలక ప్రాంతాల్లో తిరిగిందని కానీ ఎవరూ గుర్తించలేదని చెప్పారు. పుల్వామా ఘటన పూర్తిగా కేంద్రం నిర్లక్ష్యమేనని సత్యపాల్ మాలిక్ మాటలతో అర్థం అవుతోంది. అయితే ఈ ఘటనతో బీజేపీ ఎన్నికల సమయంలో బాగా సానుభూతిని రగిల్చి లబ్ది పొందింది.

సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీనికి ప్రధాన మీడియా సంస్థలు పెద్దగా ప్రాధన్యత ఇవ్వలేదు కాని ఓ సెక్షన్ మీడియా ఉదృతంగా ప్రచారం చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసేసరికి…యూపీ లైవ్ మర్డర్స్ ఘటనను ప్రధాన మీడియా సంస్థలు సంచలనంగా మార్చేశాయి. మీడియా సమావేశం జరుగుతుండగానే ఇద్దరు గ్యాంగ్ స్టార్లను కాల్చిచంపారు. సినీ ఫక్కీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన జరగక ముందు ఆ గ్యాంగ్ స్టార్లను మట్టిలో కలిపెస్తామని ముఖ్యమంత్రి యోగి అన్న మాటల్ని… ఈ మర్డర్స్ ను చూపించి ఓ రేంజ్ లో ప్రచారం చేశారు. దీంతో పుల్వామా దాడి ఘటనపై సత్యపాల్ మాలిక్ చేసిన వ్యాఖ్యలకు వార్తల్లో పెద్దగా స్పెస్ దక్కకుండా జాగ్రత్తపడ్డారు.

మోడీ సర్కార్ దేశంలో మీడియా సంస్థలని నియత్రిస్తుందని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సత్యాపాల్ మాలిక్ వార్తకు స్పెస్ ఇవ్వకుండా యూపీ మర్డర్స్ కు సంబంధించిన వార్తను హైలెట్ చేసి పుల్వామా ఘటనపై జనాల్లో చర్చ జరగకుండా చూసుకున్నారనే విమర్శలు సహజంగానే వస్తున్నాయి.