Tealngana : తెలంగాణలో వర్షాలు కుండపోతుగా కురుస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఆ జిల్లా ఈ జిల్లా అని లేకుండా ప్రతి జిల్లాలో వరుణుడు విజృంభించడంతో అన్ని జిల్లాల్లోని వాగులు, వంకలు, చెరువులు, పొంగిపొర్లుతున్నాయి. దీంతో వందలాది ఎకరాలు వర్షం నీటిలో మునిగిపోయాయి. ప్రతి జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగడం జరుగుతుంది. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కీలక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. వచ్చే మూడు రోజులు అనగా సోమవారం, మంగళవారం, బుధవారం 3 రోజులు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడం జరిగింది.
తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్ష సూచన ఉండడం వలన సీఎం అధికారులను అప్రమత్తం చేస్తూ ఈ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గారు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లాల పరిస్థితి వర్షాల కారణంగా నెలకొన్న పరిస్థితుల గురించి సోమేశ్ కుమార్ గారు సమీక్షించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సిఎస్ ఆదేశాలను ఇచ్చారు.
Tealngana : ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం..
ఇప్పటికే మూడు రోజులుగా కురిసిన వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చెరువులు వాగులు పొంగిపొర్లుతున్నాయి. మేడారం కి రాకపోకలు ఆల్రెడీ బంద్ అయ్యాయి జంపన వాగు ఉధృతంగా ప్రవహించడంతో మేడారం కి రాకపోకలు ఆగిపోయాయి. వేటూరి నాగారం మంగపేట మధ్య ఉన్న జీడి వాగు పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లి జిల్లాలో కూడా ఎడ తెరుపులేని వర్షంతో జిల్లాలోని జడ్పీ స్కూల్ వరదనీడితో నిండిపోయింది, గ్రామాల్లోకి వరద నీరు చేరింది. ఎడతెరిపి లేని వర్షాలతో మంథని కూడా వర్షపు నీరుతో నిండిపోయింది.
Tealngana : 3 రోజులు పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.
మంథని ఆనుకొని ఉన్న మారేడు వాగు బొక్కల వాగు గోదావరి ఉధృతంగా పవర్ ప్రవహిస్తోంది. గోదావరిలో నీటి వరద అధికంగా రావడంతో గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇక నిర్మల్ జిల్లాలను ఇదే పరిస్థితి ఉండడంతో చెరువులు కుంటలు భారీగా వస్తున్న వర్షపు నీటి కి పొంగిపొర్లుతున్నాయి. ఆ ప్రాంతం ఎమ్మెల్యే అయినటువంటి అజ్మీర రేఖ నాయక్ పరిస్థితిని సందర్శించి అధికారులను అప్రమత్తం చేశారు.
నిర్మల్ జిల్లా ప్రాంతంలోని ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భద్రాచలం గోదారి వరద బాగా పెరుగుతూ ఉండడంతో రాత్రికి రాత్రి మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇప్పటికే గోదావరి నీటిమట్టం 43 అడుగులు చేరడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలియజేశారు. మూడు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలతో సంక్షేమ హాస్టల్ లో ఉన్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
హనుమకొండ వరంగల్ జిల్లాలోని సంక్షేమ హాస్టల్ విద్యార్థులు భారీ వర్షాలకు చలికి వణికి పోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ అధికారులు అన్మహ కొండ హాస్టల్లో సందర్శించి జాగ్రత్తలు తీసుకోవాలని హాస్టల్ సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ హాస్టల్ ను సందర్శించారు. అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
గోదారి కాలేశ్వరం వరద నీటితో ఊరకలేస్తుంది. ధవలేశ్వరం నీటిమట్టం ఇప్పటికే 13 అడుగులు దాటింది. రెండు లక్షల క్యూసెక్కులకు పైగా నీరు 175 గేట్ల నుండి సముద్రంలోకి వదులుతున్నారు. బొబ్బిలంక ములకలంక గ్రామాల మధ్య గోదావరిలో నీరు భీకరంగా ప్రవహించడంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీ కి భారీగా వరద నీరు చేరుతుంది. అందువల్ల 40 వేల క్యూసెక్కుల నీరు 30 గేట్ల ఎత్తి దిగువకు వదులుతున్నారు.