Dhruv Vikram : విక్రమ్ పలు భాషల చిత్రాలను నటించి మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నాడు. తను శివ పుత్రుడు తమిళ్ పితామగ్ సినిమాకు నేషనల్ అవార్డును అందుకున్నాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం విలక్షణ నటుడు విక్రమ్ కు సడన్గా హార్ట్ ఎటాక్ గురయ్యారని విక్రమ్ కుటుంబ సభ్యులు చెన్నైకు ఆసుపత్రికి తీసుకెళ్లారని శుక్రవారం వార్తలు వచ్చాయి. విక్రమ్ ఆరోగ్యం కాస్త కుదుటపడింది. అని అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అని విక్రమ్ ఫ్యామిలీ ,హాస్పిటల్ వైద్యరంగం వారు సమాచారం ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.
దాని తర్వాత ఆయన గుండె వాల్సు మూసుకుపోయాయని అందుకే హాస్పటల్ కు వచ్చి జాయిన్ అయ్యారని మీడియాలో స్టోరీలు వస్తున్నాయి. అయితే ఈ రూమర్స్ పై ఆగ్రహం చేస్తూ విక్రమ్ మేనేజరు మీడియాలో డాక్టర్ అరవింద్ సిల్వరాజ్ రిలీజ్ చేసిన హెల్త్ బుల్ టెన్ షేర్ చేశారు. ఈ కాపీలో విక్రమ్ కు ఎలాంటి గుండె నొప్పి రాలేదని చెస్ట్లో చిన్న ఇబ్బంది వలన ఆయన హాస్పటల్లో జాయిన్ అయ్యారు. మా స్పెషలిస్టులు మంచి వైద్యం అందించారు. విక్రమ్ గారు తొందరలో డిస్చార్జ్ అవుతారని కావేరి వైద్యరంగం వారు సమాచారం అందించారు. దాంతో విక్రమ్ ఫ్యాన్స్ కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు అయితే విక్రమ్ తనయుడు తండ్రి పై వచ్చిన అపోహలుకు ఆదిత్య వర్మ ఫేమ్ ధ్రువ్ విక్రమ్ మండిపడ్డారు.
Dhruv Vikram : విక్రమ్ హార్ట్ ఎటాక్ రూమర్స్ చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ద్రువ్ విక్రమ్.

మీడియాలో ,ఇనిస్టాలో తండ్రి హార్ట్ ఎటాక్ రూమర్స్ ను వ్యతిరేకిస్తూ ఒక పోస్ట్ షేర్ చేశారు. ప్రియమైన అభిమానులు అలాగే శ్రేయోభిలాషులకు నేను చెప్పేది ఏమిటంటే మా నాన్నగారు ఒక చిన్న సమస్యతో హాస్పిటల్ వైద్యం కోసం వెళ్లారు ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చిందనేది, పూర్తిగా తప్పుడు సమాచారం ఇలాంటి న్యూస్ విని మా కుటుంబ సభ్యులు చాలా బాధపడుతున్నారు. ఇలాంటి సమయంలో మా కుటుంబానికి మా నాన్నకు కాస్త ప్రైవసీ ఇస్తారని అనుకుంటున్నాను. మా నాన్న బాగానే ఉన్నాడు ఇకనైనా ఈ రూమర్స్ కు చెక్ పెట్టండి .అంటూ పోస్ట్లు చేశారు. ఇప్పుడు ఈ వార్త మీడియాలో తెగ వైరల్ అవుతుంది.