అయితే పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సమకాలిన అంశాల గురించి మాట్లాడుతుంటారు. కోట శ్రీనివాసరావు గారు ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీ గురించి అలాగే రాజకీయాల గురించి మాట్లాడుతూ వైరల్ అవుతూ ఉంటారు. సినిమాలో ఉంటూనే ఆయన రాజకీయాల వైపు వెళ్లిన ఆయన బీజెపి పార్టీ తరపున విజయవాడ ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే ఆయన ఒకసారి మాత్రం చేసిన రాజకీయాలు మనకి సరిపడవని బయటికి వచ్చేసారు. వాజ్ పేయి గారు అంటే అభిమానం ఉండటం వలన బిజెపిలోకి చేరినట్లు చెప్పిన ఆయన ప్రస్తుతం రాజకీయాల గురించి మాట్లాడుతూ అన్నీ ఒలిచి చేతిలో పెట్టినట్లుగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు.
వాళ్లేమో బ్రిడ్జిలు అవి కట్టించుకుంటూ పరిపాలన సాగిస్తున్నారు. రాజధాని కూడా లేకుండా ఏపీ ఉంది. ఒకవేళ ఓట్లు వేసి తప్పు చేసి ఉంటే ప్రస్తుతం ఏపీ అనుభవిస్తున్న సమస్యలు దానివల్లే వచ్చినట్లు కదా అని, ఆయన అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి అయితే కోటా శ్రీనివాసరావు గారు ఏపీ రాజకీయాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.