Rapaka Vara Prasad : 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఎన్ని సీట్లు గెలిచిందో తెలుసు కదా. ఒక్కటంటే ఒక్కటే సీటు గెలిచింది. అది కూడా రాజోలు నియోజకవర్గం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసినా గెలవలేదు కానీ.. రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాద్ ఒక్కరే గెలిచారు. 2019 ఎన్నికల్లో ఓటమితో పవన్ కొంచెం కుంగిపోయినప్పటికీ.. మళ్లీ తేరుకున్నారు. అవన్నీ పక్కన పెడితే అసలు గెలిచిన ఆ ఒక్క ఎమ్మెల్యే అయినా జనసేనతో మంచిగా ఉండాలి కదా.

కానీ.. జనసేన పార్టీ నుంచి గెలిచి జనసేనకే దూరం అయ్యారు రాపాక వరప్రసాద్. ప్రస్తుతం ఆయన ఎలాంటి పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. అసలు జనసేన పార్టీకే దూరం అయిపోయారు. జనసేన పార్టీ అధినాయకత్వం కూడా దాదాపుగా రాపాకను బహిష్కరించినట్టే లెక్క. ఎందుకంటే ఆయన్ను ఎలాంటి సమీక్ష సమావేశాలకు ఆహ్వానం అందించడం లేదు. రాజకీయ భేటీలకు కూడా పిలవడం లేదు.
Rapaka Vara Prasad : 2024 ఎన్నికల్లో రాపాకకు టికెట్ ఇచ్చే చాన్స్ లేదా?
వచ్చే ఎన్నికల్లో అంటే 2024 లో రాపాకకు మళ్లీ పవన్ కళ్యాణ్ టికెట్ ఇచ్చే ఉద్దేశం లేనట్టు కనిపిస్తోంది. రాపాక గెలిచాక.. జనసేనను పట్టించుకోకపోవడం, పార్టీకి దూరం అవడం వల్ల.. వచ్చే ఎన్నికల్లో రాపాకకు టికెట్ ఇచ్చే చాన్స్ లేదని అంటున్నారు. ఆయన తొలి నుంచి అధికార వైఎస్సార్సీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుండటం వల్ల ఆయన్ను పార్టీ దూరం పెట్టింది. సీఎం వైఎస్ జగన్ తీసుకునే ప్రతి నిర్ణయానికి రాపాక జై కొట్టడం, స్వాగతించడం.. పవన్ కు మింగుడుపడలేదు. ఏదైతేనేం… వచ్చే ఎన్నికల్లో రాజోలులో తాను వైసీపీ నుంచి పోటీ చేస్తున్నాను అని రాపాక బహిరంగంగానే ప్రకటించారు అంటే ఆయన వైసీపీకి ఎంత మద్దతు ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. చూద్దాం మరి.. జనసేన అధినేత ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో?