Telangana CM KCR : ముందస్తు ఎన్నికలకు వెళ్లే ధైర్యం విపక్షాలకు ఉందా? దమ్ముంటే వెంటనే తేదీని ఫిక్స్ చేయండి. ఎన్నికలకు వెళ్తేందుకు నేను రెడీ అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ విపక్షాలకు సవాల్ విసిరారు. ప్రగతి భవన్ లో తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడారు.

బీజేపీ నేతలకు దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి నేను రెడీ. కేంద్రంలో బీజేపీ పాలన ఎలా ఉందో అందరికీ తెలుసు. ఇప్పటికే దేశం వంద ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది.. అని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు.
Telangana CM KCR : తేదీ ఫిక్స్ చేసి ముందుకు రావాలని బీజేపీకి సవాల్
నేను అసెంబ్లీకి రద్దు చేయడానికి రెడీ. ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు కూడా రెడీ. నేను అన్నింటికీ సిద్ధమే. మరి.. ఎన్నికల డేట్ ఫిక్స్ చేసి ముందుకు వస్తే.. ముందస్తు ఎన్నికలకు తేదీ ఫిక్స్ చేసి ముందుకు వస్తారా అని బీజేపీకి సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు.
అసలు దేశ చరిత్రలోనే ఇంత అసమర్థ ప్రధానిని ఎక్కడా చూడలేదని.. దేశాన్ని నాశనం చేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం అని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఏరంగంలోనూ దేశం ఇప్పుడు అభివృద్ధిలో ముందుకు వెళ్లడం లేదు. ఎక్కడ చూసినా అవినీతి, కుంభకోణాలు. అందరూ అప్రమత్తం కావాలి. మోదీ ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టాలి అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
త్వరలోనే టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా మారుతుంది. అది ఖాయం. దానిపై కసరత్తు కూడా జరుగుతోంది. నేను ప్రధాని మోదీని అడిగిన ప్రశ్నలకు హైదరాబాద్ వచ్చి కూడా ఒక్క సమాధానం చెప్పలేకపోయారని కేసీఆర్ తెలిపారు.