Tamanna Bhatia : మిల్కీ బ్యూటీ తమన్న బాటియా ఇండస్ట్రీలోనే మంచి క్రేజ్ ను అందుకుంది. ఈ అమ్మడు ఒక తెలుగే కాదు. పలు భాషలు ఎన్నో చిత్రాలను చేసింది. ఈ భామ, ఎఫ్2లో తన నట ఎదినతో అందర్నీ అలరించింది. ఇప్పుడు F3చిత్రంలో కూడా నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తమ అభిమానులతో చిట్ చాట్ చేశారు. తాజాగా ఈ అమ్మడు ఆస్క్ అంటూ తన ఫాలోవర్స్ కు ఒక ఛాన్స్ ఇచ్చింది. వెంటనే నేటి విజన్లు ప్రశ్నలు సంధించారు. మిల్కీ బ్యూటి తమన్న స్మూత్ గా జవాబులు ఇచ్చింది. వాటిలో కొన్ని సమాధానాలు ఇలా ఉన్నాయి.
మీరు చేసిన సినిమాలలో మెయిన్ రోల్స్ గా అనుకునేది?
బాహుబలి లో అవంతిక, ధర్మధురై సినిమాలో సుభాషిని వీటిని స్పెషల్ గా ఫీల్ అవుతూ ఉంటాను.
Tamanna Bhatia : “ఇదే కదా లక్ అంటే”

మీ దృష్టిలో లక్ అంటే?
నా కష్టానికి అభిమానులు, కాలం సాయపడడాని అదృష్టంగా ఫీల్ అవుతాను.
తెలుగులో చిత్రాలు చేస్తారా?
ఛాన్స్ వస్తే ఎందుకు చేయను తప్పకుండా చేస్తాను.
మీ జీవితంలో ఛాలెంజింగ్ పాత్ర ఏమిటి?
ఎఫ్ 3 చిత్రంలో చేసిన అబ్బాయిగా ఛాలెంజింగ్ రోల్.
ఎలాంటి కల్పిత రోల్స్ లను మీ కెరియర్లో నిజంగా కావాలనుకుంటారు?
షెర్లాక్ హోమ్స్ రూల్స్.
ఫుల్ పెడ్జు డాన్స్ చిత్రం ఎప్పుడు చేస్తారు?
నాకు చేయాలని ఉంది నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి దాంట్లో ఇది ఒకటి అంటుంది తమన్నా.
సక్సెస్ కావాలంటే ఏం ఫాలో అవ్వాలి అంటారు?
మీ గోల్ సాధించడానికి బాగా కష్టపడండి. అలాగే మీ ఫ్యాషన్ ఫాలో అవ్వండి. ఒకవేళ ఫెయిల్ అయిన మళ్లీ మళ్లీ ప్రయత్నం చేయండి.
మీ నెక్స్ట్ సినిమాలు ఏంటి?
బబ్లీ బౌన్సర్ చిత్రం తొందరలో విడుదల కానున్నది. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోకు వెబ్ సిరీస్ చేస్తున్నాను.
చిరంజీవి గారితో బోలా శంకర్ సినిమా చేస్తున్నాను. తొందరలో తాజాగా ప్రాజెక్ట్ ఒకటి రిలీజ్ చేయబోతున్నాను.
మీరు బాగా భయపడే విషయమేంటి?
నేను కొన్నిసార్లు నా జ్ఞాపక శక్తిని కోల్పోతూ ఉంటాను ఇది నన్ను చాలా భయపెట్టేస్తుంది.
అని తమన్నా భాటియా తన ఫ్యాన్స్ కు చాలా స్మూత్ గా సమాధానం ఇచ్చింది.