తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ – టచ్ లో కీలక నేతలెవరైనా ఉన్నారా..?

యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కల్గిన తీన్మార్ మల్లన్న కీలక ప్రకటన చేశారు. కొత్త పార్టీ పెట్టనున్నట్లు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తానో కూడా ప్రకటించారు. మంగళవారం జైలు నుంచి విడుదల అయిన మల్లన్న అక్కడ మీడియాతో మాట్లాడుతూ పార్టీ ప్రకటన చేశారు.

Advertisement

తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో పార్టీ పెట్టనున్నట్లు స్పష్టం చేశారు. మేడ్చల్ నియోజకవర్గం నుంచి వచ్చే పోటీ చేయనున్నట్లు తెలిపారు. మంత్రి మల్లారెడ్డి భూఅక్రమాలపై తరుచుగా మాట్లాడే మల్లన్న తప్పకుండా మల్లారెడ్డిపై పోటీ చేస్తానని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన జైలు నుంచి బయటకొచ్చిన వెంటనే పార్టీ ప్రకటన చేసి మల్లారెడ్డిపై పోటీ చేయబోతున్నట్లు ప్రకటించడం సంచలనం రేపుతోంది. ఇటీవల మల్లన్న ఆఫీసుపై దాడి చేసింది కూడా మల్లారెడ్డి అనుచరులే కావడంతో ఆయన ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

తెలంగాణలోని యూత్ లో తీన్మార్ మల్లన్నకు మంచి పట్టుంది. 7200పేరుతో ఆయన విస్తృత స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో ప్రశ్నించే గొంతుకగా మల్లన్న గుర్తింపును దక్కించుకున్నారు. బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలు, మంత్రుల భూకబ్జాలు, ఎమ్మెల్యేల లైంగిక వేధింపులపై మల్లన్న వరుసగా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆఫీసుపై దాడి జరిగింది. ఆ సమయంలో ఓ వ్యక్తిని మల్లన్న టీమ్ సభ్యులు చితకబాదారని ఫిర్యాదు చేయడంతో మల్లన్నతోపాటు నలుగురిపై కేసు నమోదు చేశారు.

మల్లన్నకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు తెరవెనక చాలా ప్రయత్నాలే జరిగాయి. ఎట్టకేలకు బెయిల్ పై బయటకొచ్చిన మల్లన్న పార్టీ ప్రకటన చేయడం చర్చనీయాంశం అవుతోంది. అయితే… మల్లన్నతో మరెవరైనా రాజకీయ పార్టీలకు చెందిన నేతలు టచ్ లో ఉన్నారా..? అనే సందేహాలు వస్తున్నాయి.

Advertisement