అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ లో మాత్రం చెన్నై జట్టు తరుఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సీజన్ లో ధోని ప్రదర్శనపై అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే ఇన్నింగ్స్ ఆఖరు ఓవర్ల సమయంలో బ్యాటింగ్ చేసే అవకాశం వస్తుండటంతో ధోనికి ఎక్కువ సేపు ఆడే అవకాశం దక్కడం లేదు. దీంతో చెన్నై బ్యాటింగ్ ఆర్డర్ మార్చాలనే డిమాండ్లు వస్తున్నాయి.
కేవలం ఐపీఎల్ లో మాత్రమే కొనసాగుతున్న ధోని ఐపీఎల్ కు కూడా ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. గత మూడేళ్ళుగా ఇదే తరహ ప్రచారం జరుగుతోంది. కానీ ధోని మాత్రం ఈ వార్తలపై అస్సలు స్పందించడం లేదు. తాజాగా ధోని పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఐపీఎల్ కు రిటైర్మెంట్ ఎప్పుడని ప్రశ్నించారు. దానికి ఇంకా సమయం ఉందంటూ ధోని నవ్వుతు సమాధానం ఇచ్చారు.
రిటైర్మెంట్ పై ఇప్పుడెం మాట్లాడిన అది జట్టుపై ప్రభావం చూపుతుందని సమాధానం చెప్పారు ధోని. కోచ్ తోపాటు ప్లేయర్లపై ఎఫెక్ట్ చూపుతుందని అందుకే రిటైర్మెంట్ పై ఇప్పుడెం మాట్లాడబోనని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ధోని వ్యాఖ్యలను చూస్తుంటే ఈ సీజన్ ఆఖర్లో రిటైర్మెంట్ పై స్పష్టత ఇస్తారని అర్థం అవుతోంది.
ఈ సీజన్ లో చెన్నై జట్టు ఐపీఎల్ విజేతగా నిలిస్తే ధోని ఖచ్చితంగా ఈ ఫార్మాట్ నుంచి ఈ ఏడాదే తప్పుకుంటాడని లేదంటే వచ్చే ఏడాది కూడా ధోని ఐపీఎల్ లో ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది.