Venu Swamy : రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు వేణు స్వామి సుపరిచితమే. సెలబ్రిటీల జాతకలను మరియు రాజకీయ నాయకుల జాతకాలను చెబుతూ వేణు స్వామి బాగా పాపులర్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేయడం కూడా మొదలుపెట్టారు. కానీ సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు చాలామంది వేణు స్వామిని ఎంతగానో నమ్ముతారు. ఇక ఆయనతో పూజలు జరిపించుకునేందుకు ఎంత డబ్బును వెచ్చించటానికైనా వెనుకాడరు. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్న నేపథ్యంలో చంద్రబాబు గురించి మరియు జగన్ గురించి వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనగా మారాయి.
అయితే జగన్ సీఎం కాకముందు 2018లో దాదాపు నాలుగు సార్లు జగన్ సీఎం కావాలని వేణు స్వామి రాజశ్యామల యాగం చేశారట. వైజాగ్ కు దగ్గర్లో ఉన్న భీమిలిలో ఈ యాగాన్ని చేసినట్లు సమాచారం. అయితే అదే సమయంలో చంద్రబాబుకు కూడా ఇలాంటి రాజ శ్యామల యాగం చేయించుకోవడం మంచిదని పలుమార్లు వేణు స్వామి హెచ్చరించారట. అయినా కూడా చంద్రబాబు వినలేదని వేణు స్వామి చెప్పుకొచ్చాడు. 2019లో ఎలాగైనా రాజశ్యామల యాగం చంద్రబాబు చేయించుకోవాలని నందమూరి బాలకృష్ణకు చెప్పగా చంద్రబాబును బాలయ్య ఒప్పించే ప్రయత్నం చేశారట.
అయినప్పటికీ యాగంలో కూర్చునెందుకు చంద్రబాబు ససిమేర ఒప్పుకోలేదు. ఈ తరుణంలో మీరు యాగాన్ని చేయించుకోండి మీరు ఎమ్మెల్యే అవుతారని బాలయ్యకు చెప్పారట.కానీ మీ పార్టీ రూలింగ్ లో మాత్రం ఉండదని వేణు స్వామి చెప్పినట్లు తెలియజేశాడు . అనంతరం బాలకృష్ణ యాగం చేయడం వలన వేణు స్వామి చెప్పినట్లుగానే ఎమ్మెల్యే అయినట్లు చెప్పుకొచ్చారు. అయితే చంద్రబాబు మాత్రం ఎందుకు ఒప్పుకోలేదని ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ అడుగగా..ఆయన అంతే ఎవరిని నమ్మరు..ఆయన లోకం వేరు అంటూ వేణు స్వామి చెప్పుకొచ్చారు. దీంతో ప్రస్తుతం వేణు స్వామి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.