Papaya seeds : బొప్పాయిని తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతుంటే వింటూనే ఉంటాం. అయితే బొప్పాయి ముక్కలే కాకుండా గింజల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే బొప్పాయి అనేది చిన్న నుండి పెద్ద వరకు ప్రతి భారతీయుడు తప్పనిసరిగా తినే పండు. అలాగే ఇది చాలా చౌకగా లభించడంతో పేద ధనిక బేధం లేకుండా ప్రతి ఒక్కరు దీన్ని తీసుకుంటారు. అయితే ఈ బొప్పాయి పండ్లలో ఉండే విటమిన్స్ మరే ఇతర పండ్లలో లభించవని వైద్యులు చెబుతున్నారు.
ఇక దీనిలో విటమిన్ ఏ, బి ,సి ,డి వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇక దీనిని ఆహారంలో తీసుకోవడం వలన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. అలాగే దీనిలో ఉండే పెక్సిన్ అనేే పదార్థం జీర్ణక్రియను సాఫీగా చేసేలా చూస్తుంది. అంతేకాక ఉదర సంబంధమైన జబ్బులను నయం చేయడంలో బొప్పాయి పండు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే బొప్పాయి గింజలు అనేక రకాల పోషకాలను కలిగి ఉంటాయి. కానీ వీటిని నేరుగా తినడం వలన చేదుగా అనిపిస్తుంది.
తద్వారా ఎవరు వీటిని తినాలి అనుకోరు. కావున వీటిని ఎండలో ఎండబెట్టి తర్వాత గ్రైండ్ చేసి పొడిలా చేసుకుని తీసుకుంటారు. ఇలా చేసుకుని తీసుకోడం వలన గుండె ఆరోగ్యం మెరుగవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాక ప్రస్తుతం చాలామంది గుండెపోటు సమస్యలతో బాధపడుతున్నారు.అలాంటి వారికి బొప్పాయి గింజలు సంజీవని కంటే ఎక్కువ అని వైద్యులు తెలియజేస్తున్నారు. అలాగే ఈ విత్తనాల సహాయంతో రక్తపోటును కూడా అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే లైంగిక సమస్యలతో బాధ పడే వారికి ఇది దివ్య ఔషధంగా సూచిస్తున్నారు.
గమనిక : ఈ కథనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా దీనిని రూపొందించడం జరిగింది. యువతరం దీనిని దృవీకరించలేదు.