Srireddy : శ్రీరెడ్డి ఇన్ని సంవత్సరాలు నేను వై సీ పీ లో ఏ పదవి లేక పోయినా ఎంతో కష్టపడ్డా, పార్టీ కోసం ఇంత చేసినా ఈ చిన్న సహాయం చేయరా అని అసహనం తో నిప్పులు చెరిగింది శ్రీరెడ్డి. పార్టీ లో యాక్టివ్ మెంబర్ గా ఉంటూ పార్టీకి తన అవసరం ఎప్పుడు వచ్చినా క్రియాశీల సభ్యురాలిగా తనవంతు ప్రయత్నం చేసేధని, ఎన్ని చేసినా తనకు పార్టీ నుంచి గౌరవం దక్కలేదని, ఇంకా అవసరం ఉండి సహాయం కోరినా ఎవరు స్పందించలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది ఫైర్ బ్రండ్ శ్రీరెడ్డి. తాను పార్టీకి ఇన్ని ఏళ్ల నుండి కష్ట పడుతున్నాను అని తనకి తగిన గుర్తింపు ఎవ్వటం లేదని వాపోయింది.
శ్రీరెడ్డి రెడీ ఈ వాఖ్యల్నిటికి కారణం తన సొంత ఊరిలో శ్రీ వేంకేశ్వరస్వామి స్వామికి గుడి నిర్మిస్తున్నారు. ఈ గుడి కోసం ఎన్నో సంవత్సరాలుగా శ్రమిస్తున్నారు. టీ డీ పీ ప్రభుత్వం లో కొన్ని ఫండ్స్ వచ్చాయి. కానీ వై సీ పీ ప్రభుత్వం వచ్చాక గుడి నిర్మాణానికి కవలసిన ఫండ్స్ ఎటువంటివి రాకపోవడంతో తీవ్ర అసం తృప్తి కి గురి కావటం జరిగింది. ఎంత మంది మంత్రులను ఏం ఎల్ ఏ లను కలిసి వివరించిన తను అనుకున్న పని కాలేదు అని విరుచుకు పడింది. ఈ కారణం గా ఈమె ఆసంతృప్తిని ప్రభుత్వం పై తెలియజేసింది.
Srireddy : శ్రీరెడ్డినీ వై సీ పీ వాళ్ళు అంత మోసం చేశారా

శ్రీరెడ్డి పార్టీ గురించి మాట్లాడుతూ ఎన్నికలు ఎంతో దూరం లో లేవు కార్యకర్తల్ని దూరం పెడితే పార్టీ దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పింది. ఎన్నికల్లో 20 లేదా 30 సీట్లు తగ్గినా ప్రజల్లో అసంతృప్తి పెరిగింది అని పార్టీ పెద్దలు గ్రహించాలి అని ఆమె అధికార పార్టీని హెచ్చరించింది. శ్రీరెడ్డి అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు చేయొద్దు అని అధికారం శాశ్వతం కాదు అని తెలిపింది. ప్రభుత్వ పథకాలు ఎంత బలంగా ఉన్న ప్రజలలో అసంతృప్తి పెరగకుండా చూసుకోవాలి అని హితవు పలికారు. తాను తలచింది దైవకార్యం అని తన సొంత పనికోసం డబ్బులు అడగట్లేదు అనీ అది గ్రహించాలి అని శ్రీరెడీ సూచించింది. తన తండ్రి గుడి కోసం అహర్నిశలు పని చేస్తున్నారు అని చెప్పుకొచ్చింది. ఎన్ని రోజులు పార్టీలో ఉండి సొంత ఊరి కోసం గుడి కట్టటానికి సహాయం రానందుకు చాలా బాధపడింది. తాను ఫేస్ బుక్ లైవ్ ద్వారా తన భాదను వెల్లడించింది.